నారా రోహిత్తే రౌడీ ఫెలో

రౌడీ ఫెలో అంతా ఒక్కా నారా రోహిత్ ప్రతిభ మీదే సాగి ఇదొక వన్ మ్యాన్ షో అనిపించుకుందంటే అతిశయోక్తి కాదు.

క్రిషన్ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన రౌడీ ఫెలో నారా రోహిత్ తో పాత విశాఖ సింగ్, అజయ్, గొల్లపూడి మారుతిరావు, రామేశ్వరి తదితరులు నటించారు. ప్రకాష్ రెడ్డి ఈ చిత్ర నిర్మాత. ఎం ఆర్ సన్నీ స్వరాలు సమకూర్చారు.

పోలీస్ ఆఫీసర్ గా నటించిన రౌడీ ఫెలో నారా రోహిత్ నటన బాగుంది. రోహిత్ మానరిజమ్స్, మాటల ఉచ్చారణ చాలా బాగున్నాయి. ఈ సినిమాకి రోహిత్ ప్రతిభ ఓ హైలైట్ అని చెప్పుకోవాల్సిందే. మరోవైపు ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన విశాఖ సింగ్ కి చెప్పుకోదగిన పాత్ర లేకపోయినా తనకిచ్చిన పాత్రను బాగానే పోషించింది.

నారా రోహిత్ అహం సామాన్యమైనది కాదు. తనను ఎవరైనా నొప్పిస్తే వాళ్ళను ఎంత కాలమైనా సరే వెతుక్కుంటూ వెళ్ళి కొట్టి తృప్తి పడే మనస్తత్వం కలవాడు.ఈ పాత్ర ఈ సినిమాకి చెప్పుకోదగ్గ అంశం.
కథని భిన్నంగా నడిపించడం బాగుంది. ఈ చిత్రంలో హీరో పాత్ర పలువురు పాత్రల జీవితాల్లోకి వెళ్లి వారి సమస్యలని పరిష్కరించడం ఓ ప్రత్యేకత.

కృష్ణ చైతన్య రాసిన మాటలు గొప్పగా ఉన్నాయి. ప్రతి మాటా అర్ధవంతమైనదే.

విలన్ పాత్రలో రావు రమేష్ నటనకు వంద మార్కులు వెయ్యవలసిందే. నారా రోహిత్, రావు రమేష్ మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేక్షకులను నవ్వించిన పోసాని కృష్ణమురళికి రాసిన మాటలు కూడా బాగున్నాయి.

అయితే ఈ సినిమా మొదట వేగంగా మొదలైనా ఆ తర్వాత కాస్త చాలా నెమ్మదిగా సాగింది. కథనం కొత్తగా ఉంది. మొత్తం మీద సినిమా ఓకే.

Send a Comment

Your email address will not be published.