"నా బంగారు తల్లి"

మన దేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎప్పటినుంచో నలుగుతున్న సమస్య. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ క్రమంలో ఎందరో యువతులు తమకు తెలియకుండానే వ్యభిచార వృత్తిలోకి దిగిపోతున్నారు. ఈ దారుణ సమస్య మీద పోరాడి అనేక మంది అమ్మాయిలకు విముక్తి కల్పించిన  ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్. ఆమె ఎందరో అమ్మాయిల కన్నీటి వాస్తవాలు విన్నారు…స్వయంగా తెలుసుకున్నారు కూడా. ఈ నేపధ్యంలో ఆమె దృష్టికి వచ్చిన ఒక వాస్తవ సంఘటనను వెండితెరకు ఎక్కించి నలుగురినీ చైతన్య పరచాలనుకున్న ఆలోచనకు ప్రతిరూపం “నా బంగారు తల్లి” చిత్రం.
అంజలి పాటిల్, సిద్ధిక్, రత్న శేఖర్, లక్ష్మీ మీనన్, నేనా కురూప్, తదితరులు నటించిన నా బంగారు తల్లి చిత్రానికి రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్ ప్లే కూడా రాజేష్ వంతే.
దుర్గ పాత్రలో నటించిన అంజలి పాటిల్ కథలో  ఇంటర్ ర్యాంక్ తో ప్యాస్ అవుతుంది. ఆమెకు విద్యాసంస్థ ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తుంది. అయితే ఆమె తానీ స్థాయికి ఎదిగానంటే అందుకు కారణమైన తన తండ్రిని సత్కరించాలని చెప్తుంది. ఆమె కోరుకున్నట్టే ఆమె తండ్రిని సత్కరిస్తారు కూడా.
ఆ తర్వాత ఆమె పై చదువుల కోసం ఒక కాలేజీకి అప్లికేషన్ పెట్టుకుంటానని చెప్తుంది. అందుకు తండ్రి ఒప్పుకోడు. కానీ ఆమె తండ్రికి తెలియకుండా దరఖాస్తు పెడుతుంది. ఆమెకు ఇంటర్వ్యూ కి రావలసిందిగా ఒక ఉత్తరం వస్తుంది. ఈ సమయంలో ఆమె తండ్రి హైదరాబాదులో ఉంటాడు. అప్పుడు తల్లి ఆమెను రైలు ఎక్కించి తన భర్తకు ఫోన్ చేసి అమ్మాయిని చూసుకోమని చెప్తుంది. సరేనని తండ్రి కూతురిని రిసీవు చేసుకుని ఒక హోటల్ లో ఉండమని చెప్పి తండ్రి బయటకు వెళ్తాడు. ఈలోపు ఆయన కూతురిని ఎలా ఎవరు వ్యభిచారకూపంలోకి బలవంతంగా నేట్టారో? తండ్రి వ్యవహారమేమిటి వంటి విషయాలన్నీ వెండితెరపై చూడాలి.
ఈ సినిమాకు శంతను మొయిత్రా సంగీతం సమకూర్చారు.
సునీతా కృష్ణన్, ఎం ఎస్ రాజేష్ ఈ చిత్ర నిర్మాతలు.

Send a Comment

Your email address will not be published.