"పట్టపగలు" సినిమాలో మార్పులు

ప్రముఖ ర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని ప్రాజెక్ట్స్ తో  బిజీగా ఉన్నారు. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రాజశేఖర్ నటించిన పట్టపగలు అనే సినిమా కూడా వాటిలో ఒకటి. ఈ హర్రర్ చిత్రంలో స్వాతి దీక్షిత్ కు రాజశేఖర్ తండ్రిగా నటించారు. విడుదలకు సిద్ధంగా ఉందనుకున్న తరుణంలో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మళ్ళీ షూట్ చేస్తారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు రాజశేఖర్ కు, జీవితకు నచ్చలేదట. కనుక ఆ నచ్చని సన్నీవేశాలను మళ్ళీ చిత్రీకరిస్తే  బాగుంటుందని రాజశేఖర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ విషయమై రాజశేఖర్ దంపతులు రామ్ గోపాల్ వర్మతో మాట్లాడినట్టు తెలిసింది. దీనితో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడానికి రామ్ గోపాల్ వర్మ అంగీకరించారని కూడా తెలిసింది.

Send a Comment

Your email address will not be published.