పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్

పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికీ మాజీ భార్య రేణు దేశాయికి ఇష్టమేనా? ఆ విషయం ఏమోకానీ ఈమధ్య ఆమె మొదటిసారిగా దర్శకత్వం వహించిన ఒక మరాటీ చిత్రం సి డీ ఆవిష్కరణ కార్యక్రమానికి రావలసిందిగా రేణు దేశాయి పవన్ కళ్యాణ్ ను పిలిచారు. ఆమె దర్శకత్వంలో రూపు దిద్దుకున్న చిత్రం పేరు ఇష్క్ వాలా లవ్.

ఆమె పిలుపునకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తాను సంతకం చేసిన సీడీని ఆమెకు పంపుతూ ఆమె దర్శకత్వం వహించిన సినిమా విజయవంతం కావాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆమె బృందానికి కూడా పవన్ అభినందనలు తెలిపారు.

రేణు దేశాయి పవన్ సంతకం చేసిన సీ డీ తాలూకు ఫోటోను ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ లో ఉన్నారని, అలాగే బ్యాక్ పెయిన్ కారణంగా సీ డీ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం లేదని పేర్కొన్నారు.

Send a Comment

Your email address will not be published.