"పూరీ"కి కోపం వచ్చింది

ప్రముఖ దర్శకుడు పూరీ  జగన్నాథ్ కు   కోపం వచ్చింది. ఆయన తన కొత్త  బృందాన్ని ఏర్పాటు  చేసుకునే  పనిలో నిమగ్నమయ్యారు.  ఆయన తన పాత   బృందం మొత్తాన్ని  తొలగించారు. దాదాపు ఇరవై అయిదు మందికి ఆయన  ఉద్వాసన  పలికారు.

ఆయన  చర్య  టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది.

ఆయన  చర్యతో  త్వరలో  రానున్న  రోగ్ చిత్రం  షూటింగ్ ఆగిపోయింది.

పూరీ  మాట్లాడుతూ, తాను తన  బృందం మొత్తాన్ని తొలగించడం  నిజమేనని,  ఆఫీస్  బాయ్  సహా  అందరినీ  తీసేసానని  అన్నారు. వారిలో  చాలా మంది  చాలా  సంవత్సరాలుగా  తన బృందంలో  ఉన్న  వారేనని,  అక్కడే  సమస్య మొదలయినట్టు  పూరీ  తెలిపారు. సిబ్బంది  బాధ్యాతారహితంగా  నడచుకుంటున్నారని ,  తన  మాట  వినడం లేదని ,  అందుకే  తొలగించానని  చెప్పారు.

వారిని తొలగించాలన్న ఆలోచన  చాలా కాలంగా  మదిలో నలుగుతోందని  అంటూ రెండేళ్ళ  క్రితమే  వారిని  హెచ్చరించానని గుర్తు  చేసారు. ఓ జట్టుగా కలిసికట్టుగా  పని  చేయడం లేదని తాను  చెప్తూ వచ్చినా  వారిలో  మార్పు  లేకపోవడంతో  ఇక  చర్య తప్పలేదని   అన్నారు. ఈ జనవరి  ఏడో తేదీ సాయంత్రం  వారిని  వెళ్ళిపోమని చెప్పానని అన్నారు.

రోగ్  చిత్రానికి సంబంధించి  తాను ఒక  ఒక  పాట చిత్రీకరించాల్సి ఉందని,  కొత్త  టీం  ని ఏర్పాటు  చేసుకుంటానని, ఈ  విషయంలో ఆలస్యం కాకపోవచ్చని, ప్రస్తుతం  ఆఫీసులో  తానొక్కడినే ఉంటున్నానని  పూరీ  చెప్పారు.

Send a Comment

Your email address will not be published.