ప్రకటనకు ఏడున్నర కోట్లు

ఆమె నటించే చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద అమోఘ విజయం సాధిస్తున్న క్రమంలో ప్రకటనల కోసం నటించేందుకు వసూలు చేసే రేటును విపరీతంగా పెంచేసింది. రేటుని ఊహించనంతగా పెంచడం విశేషం. ఇంతకూ ఆ తార ఎవరో చెప్పలేదు కదూ..? ఇంకెవరు, ఆమె దీపికా పదుకొనె.

విద్య బాలన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా తదితరులందరూ ఇప్పుడు ఆమె తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసే దీపికా ఇప్పుడు ఆ రేటుని అమాంతంగా ఏడున్నర కోట్లకు పెంచేసింది. కరీనా కపూర్ అయితే ఒక ప్రకటనకు దాదాపు లక్ష రూపాయలు తగ్గించికున్నట్టు సమాచారం. కానీ దీపిక విషయానికి వస్తే ఆమె కోటిన్నర పెంచేసినా డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇంకా పెరిగింది.

ఒక ఏజెన్సీ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటివరకూ దీపిక అడిగినంత డబ్బు మరే నటి అడగలేదని అన్నారు. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్ ల తర్వాత మహిళా స్టార్ల విషయానికి వస్తే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన వారిలో దీపికా పదుకొనె అగ్రస్థానంలో ఉందని కూడా ఆయన తెలిపారు. తమ ప్రొడక్ట్స్ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా తోడ్పడటం ఎంతో గొప్పగా ఉందని ఆయన అన్నారు.

షారూఖ్ ఖాన్ ఒక ప్రకటనకు ఏడు నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు, ఆమిర్ ఖాన్ ఎనిమిది కోట్ల రూపాయలు, సల్మాన్ ఖాన్ ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.

స్టార్ మహిళల విషయానికి వస్తే కరీనా కపూర్ కోటీ ఇరవై అయిదు లక్షలు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ నాలుగు నుంచి నాలుగున్నర కోట్లు, ప్రియాంకా చోప్రా మూడు నుంచి నాలుగు కోట్లు, విద్యా బాలన్ రెండు కోట్లు, కత్రినా కైఫ్ అయిదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. అయితే దీపికా పదుకొనె ఏకంగా ఏడున్నర కోట్ల రూపాయలు తీసుకోవడం గమనార్హం.

Send a Comment

Your email address will not be published.