ప్రియమణి బాయ్ ఫ్రెండ్ ఎవరు?

నటి ప్రియమణి తన రొమాన్స్ వ్యవహారాన్ని నిన్నమొన్నటి వరకే కాదో ఇప్పటికీ ఇంకా  గుట్టుగానే ఉంచారు. ఇప్పటికీ ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరో కచ్చితంగా తెలీదు.
మలయాళం నటుడు గోవింద్ పద్మసూర్య తన ట్విటర్ పేజీలో ప్రియమణితో కలిసి ఉన్న ఒక ఫోటో పోస్ట్ చెయ్యడంతో కొన్ని రూమర్లు  బయటికి వచ్చాయి. గోవింద, ప్రియమణి కలిసి ఉన్నఈ  ఫోటోను వాళ్ళిద్దరూ ఒక రియాలిటీ షో లోతీసుకున్నదే.
మే మిద్దరం తరచు ఫోటోలు తీసుకోవాలనుకుంటున్నాము అని అతను ట్వీట్ చేసిన మరుసటి రోజే చలనచిత్ర పరిశ్రమలో వీరిద్దరిపై  గుసగుసలు మొదలయ్యాయి.
అంతకుముందు ఒక ముఖాముఖిలో ప్రియమణి ఒక మాట చెప్పారు. తాను ప్రేమలో పడ్డాను అన్నదే ఆ మాట. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పడానికి ఇది సరైన సమయం కాదని కూడా ఆమె అప్పుడు చెప్పారు.
ఇప్పుడు తాజాగా వస్తున్న వదంతులపై ఏదైనా సమాచారం రాబట్టాలనుకోగా ఆమె అందుబాటులో లేకుండా పోయారు. ఆమె ప్రస్తుతం ఒక కన్నడ చిత్రంలో బిజీగా ఉన్నారు.
అయితే ఆమె తల్లి ఈ తాజా వదంతులను కొట్టిపారేశారు.
అసలు గోవింద్ ఎవరో కూడా తనకు తెలీదని ఆమె గట్టిగానే చెప్పారు. మరి పూర్వం ఒక ఇంటర్వ్యూ లో మీ అమ్మాయి ప్రేమలో పడ్డానని చెప్పారు తప్ప ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో పేరు చెప్పలేదు. ఇంతకూ ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో మీకైనా తెలుసా అని ప్రియమణి వాళ్ళ అమ్మను అడగ్గా “గోవింద్ అయితే కాదు. ఈ వదంతులన్నీ వొట్టి ఊహాగానాలే తప్ప మరొకటి కాదు” అని ఆమె జవాబిచ్చారు.
కనుక ప్రియమణి పెదవి విప్పే వరకు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఎవరికీ తెలీదు. ఆమె చెప్పే దాకా అభిమానులు నిరీక్షించక తప్పదు.

Send a Comment

Your email address will not be published.