ఫైట్ కి రెండు కోట్లు ?

సినిమాకు అత్యంత ప్రధానమైన కథ, కథనాల సంగతి ఎలా ఉన్నా భారీతనానికే ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టు టాలీవుడ్ లో ఓ టాక్ ఉండనే ఉంది. ఒక పెద్ద సినిమాకు భారీ పాటో భారీ ఫైటో చిత్రీకరించే వ్యయంతో ఓ చిన్న సినిమా తీసేయ్యవచ్చని చెప్పేవారున్నారు.

రవితేజ హీరోగా నటిస్తున్న పవర్ సినిమాకోసం చిత్రీకరించిన ఓ ఫైట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఆహా వోహో అని చెప్పుకుంటున్నారు. బ్యాంకాక్ లో ఈ భారీ ఫైట్ కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు చెవులు కొరుక్కుంటున్నారు.

ప్రముఖ బాలీవుడ్ ఫైట్ మాస్టర్ అలెన్ అమీన్ సారధ్యంలో ఈ ఫైట్ ని రవితేజ, కొందరు ఫైటర్ల పై చిత్రీకరించారు.

ఈ సినిమాతో రచయిత కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రాక లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్త్తున్నారు. ఈ చిత్రం టాకీపార్ట్ వర్క్ ఇటీవలే పూర్తి అయ్యింది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.