బాహుబలి..దూసుకొచ్చాడు

ఎప్పుడెప్పుడా అని అన్ని వర్గాలవారూ ఎదురు చూసిన బాహుబలి రానే వచ్చాడు ఎట్టకేలకు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రభాస్‌, రాణా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్ తదితరులు నటించిన ఈ చిత్రం భారత సినీ చరిత్రలోనే ఓ గొప్ప సినిమాగా నిలిచిపోవడం ఖాయం. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం స్వరపరచగా కెమేరాతో ఆహా ఒహో అని అనిపించుకున్నారు సెంథిల్‌. శోభు, ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని కె రాఘవేంద్ర రావు సమర్పించగా
స్క్రీన్‌ప్లే సమకూర్చి ర్శకత్వం వహించింది రాజమౌళి.

బాహుబలిపై అపారమైన అంచనాలు పెరిగిపోవడానికి వెనుక దశాబ్ధానికి పైగా రాజమౌళి పెంచుకున్న క్రెడిట్‌, అతనిపై కుదిరిన గురి వున్నాయి. మగధీర, ఈగ లాంటి సంచలన చిత్రాలతో రాజమౌళి తన విజన్‌ ఏంటనేది ముందే చాటుకోవడంతో అతడు భారతదేశ సినీ చరిత్రలోనే అతి భారీ చిత్రం తీస్తున్నాడంటే తప్పకుండా అద్భుతంగా వుంటుందనే నమ్మకం ఏర్పడింది. ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి కమర్షియల్‌ సినిమాలు ఇష్టపడే జనాలకి ఎప్పటికీ ఒక క్లాసిక్‌గా గుర్తుండిపోతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి, అతని టీమ్‌ ప్రమోట్‌ చేసిన విధానం దీనికి అంతులేని హైప్‌ తీసుకొచ్చింది. కేవలం తెలుగు సినీ ప్రియులే కాకుండా, యావద్భారత దేశ సినీ ప్రియులు దీనిని చూడాలనే కుతూహలాన్ని కలిగించింది. బాహుబలి చిత్రానికి పర భాషల వాళ్లు జేజేలు పలుకుతున్నారు. కానీ అదే సమయంలో తెలుగువారి నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అదెందుకో, అసలు బాహుబలి ఎక్కడ క్లిక్కయ్యాడో, ఎందులో తడబడ్డాడో చూద్దాం.

రాజమాత శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ ఓ శిశువును కాపాడి తమ రాజ్యానికి దూరంగా ఎక్కడో ఒక తాండాలో విడిచిపెడుతుంది. అతను అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు. అయితే శివుడు పాత్రలో నటించిన ప్రభాస్ అక్కడి జలపాతాలను దాటుకుంటూ వెళ్లి కొండకు ఆవల ఏముందో తెలుసుకోవాలని ఆరాతపడతాడు. అతను తన కోరికను అవంతిక పాత్ర పోషించిన తమన్నాసాయంతో సాధిస్తాడు.అయితే తనను చూసిన వాళ్ళంతా నమస్కరించడం, బాహుబలి అని పిలవడం చూసి తానేమిటో తెలుసుకోవాలనుకుంటాడు ప్రభాస్. అతని వద్ద సేనానిగా ఉన్న సత్యరాజ్‌ జరిగినదంతా వివరిస్తాడు. అనంతరం మాషిష్మతి సామ్రాజ్యానికి రాజు ఎవరు అని తేలాలంటే బాహుబలి, బల్లాలదేవ పాత్రలో నటించిన రాణా మధ్య ఎవరు బలశాలో త్యేవారు తెలివైన వారో తెలియవలసి ఉంటుంది. ఆ పోరులో ప్రభాస్ శక్తియుక్తులకు తిరుగుండదు. విజయం అతనినే వరిస్తుంది.అతను రాజు కావడంతో కథ ముగుస్తుంది. ఆ తర్వాత కథ కోసం వెండితెర మీద చూసి తరించాలి.

కథ మామూలుగా అనిపించినా రాజమౌళి అల్లిన పాత్రలు బలమైనవి. అన్ని పాత్రలూ ముఖ్యమైనవే.
అన్ని పాత్రలో గుర్తుండి పోయేవే. పాత్రలపరంగా బాహుబలిలో అన్నీ ఘనమైనవే. ఏ పాత్రకు ఆ పాత్రను పరిచయం చేయడంలో రాజమౌళి అనుసరించిన తీరు చాలా ఆసక్తికర్రంగా సాగింది. సన్నివేశాలు
గొప్పగా అనిపించినా ప్రేక్షకులను అలరించే నాటకీయత బలంగా లేదు. దానితో ఎంతో కొంత గ్యాప్ కనిపిస్తుంది. ఈ సినిమాకు గ్రాఫిక్స్‌, యుద్ధ సన్నివేశాలు, సెంథిల్‌ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్. వాటిని చూసి తృప్తి పడొచ్చు. ఈ సినిమాలో నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

కీరవాణి సంగీతం అదిరిపోయింది అని చెప్పలేము.

భారీ డబ్బులతో బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు కొనుక్కుని సినిమా చూసిన వారిలో సగం మంది ఇంతేనా కథ అని పెదవి విరుచుకుని బయటకు వచ్చేరనే టాక్ అయితే ఉంది.

Send a Comment

Your email address will not be published.