బాహుబలి బలవంతులు...

రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “బాహుబలి” చిత్రం కోసం ప్రభాస్, దగ్గుబాటి రానా తమ తమ పాత్రలకు తగ్గ కండలరాయుళ్ళుగా ప్రేక్షకులకు కనిపిస్తారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలూ వీరిద్దరూ తీసుకుంటున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ హీరో కాగా దగ్గుబాటి రానా విలన్.
వీరిద్దరిదీ చిత్ర కథకు సంబంధించి ప్రధాన పాత్రలే. తన గత చిత్రాలకు భిన్నమైన జానపద కథగా  ఈ బాహుబలి చిత్రాన్ని రాజమౌళి మనముందు ఉంచబోతున్నారు. . కథా పాత్రాలను దృష్టిలో ఉంచుకుని శరీర సౌష్టవం పట్ల ప్రభాస్, రానాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కేవలం వంద కిలోల బరువు మాత్రమే సరిపోదు. కండలు కనిపించాలి. కనుక ఏం చెయ్యాలి అని ఆలోచించారు. వీరిద్దరికీ ఈ విషయంలో ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డి ఎంతగానో సహకరిస్తున్నారు.
ఇంతకూ ఈ లక్ష్మణ్ రెడ్డి ఎవరో కాదు…. అమెరికాలోని లాస్ వేగాస్ లో 2010 లో నిర్వహించిన బాడీ బిల్డింగ్ టోర్నీలో ఆయన  మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ టైటిల్ గెలిచారు. అంతేకాదు ఇప్పటికే మరెన్నో టైటిల్స్ ను దేశ విదేశాలలో  సొంతం చేసుకున్న లక్ష్మణ్ రెడ్డి ప్రభాస్ విషయంలో ఎన్నో జాగర్తలు తీసుకున్నారు.
బాహుబలి చిత్రం షూటింగ్ ప్రారంభానికి ఎనిమిది నెలల ముందు నుంచే ప్రభాస్ శరీర సౌష్టవానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రభాస్, రానా ల ఆహార విషయంలోనూ, వ్యాయామాల విషయంలోనూ దగ్గరుండి లక్ష్మణ్ రెడ్డి పర్యవే క్షించారు. ఇప్పుడు ప్రభాస్ బరువు కచ్చితంగా వంద కిలోలట. రోజూ వీరిద్దరూ ఆరు నుంచి ఎనిమిది సార్లు మీల్స్ తీసుకుంటారు. అంతా నాన్ వెజ్ ఆహారమే. రైస్ దరి చేరనివ్వడం లేదు. ప్రతీ రెండు గంటలకు ఒక సారి ఆహారం తీసుకుంటున్నారు. వీరు రోజూ  తీసుకునే ఆహారంలో రెండు వేల నుంచి నాలుగు నెల కాలరీలు ఉంటున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు రెండు రకాలుగా కనిపిస్తారు. ఒక పాత్రలో  సన్నగా. మరొక పాత్రలో బరువుగా.
మరి ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ బరువు తగ్గించుకోవడం ఎలా అనే ప్రశ్న ఉదయించింది.
దానికి జవాబు ఇదిగో…..
బరువు తగ్గించుకోవడం కోసం పాటించవలసిన విధానం ఒక్కటే….అయితే ఆహారం కోటా తగ్గించుకోవాలి. సరైన పద్ధతులు పాటిస్తే నాలుగైదు నెలల్లో బరువు తగ్గుతుందని, అదేమీ పెద్ద సమస్య కాదని లక్ష్మణ్ రెడ్డి చెప్పారు. శరీర సౌష్టవం కోసం తాను స్టెరాయిడ్స్ సిఫార్సు చెయ్యనని ఆయన అన్నారు. డ్రగ్స్ ఎప్పటికీ రిస్కేనని, వాటివల్ల ఆరోగ్యపరంగా లేనిపోని సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు. న్యాచురల్  డైట్ , క్రమం తప్పని వ్యాయామం చేస్తే చాలని ఆయన సూచన.
ఇప్పుడు లక్ష్మణ్  రెడ్డి ప్రత్యేకించి ప్రభాస్ విషయాన్ని గమనిస్తుండగా మొదట్లో కొంత కాలం రానా విషయాన్ని చూసిన ఆయన ఇప్పుడు రానా భాద్యతలను ఒక మిత్రుడికి అప్పగించారు. అయితే అవసరమైనప్పుడు మధ్య మధ్యలో లక్ష్మణ్ రెడ్డి రానా విషయాన్ని కూడా గమనించకపోలేదు.

Send a Comment

Your email address will not be published.