భిన్నమైన పాత్రలు చేయాలి

తాను నటించిన కంచె విజయవంతమైన తర్వాత ఏదో ఒక్క తరహా పాత్రలకే పరిమితమై పోకూడదని వరుణ్ తేజ్ అనుకున్నారు. చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ చేయడం తనకిష్టం లేదని ఆయన స్పష్టం చేసారు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తయారైన లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ ఊహించని విధంగా భిన్నమైన పాత్రలో నటించారు. కంచె సినిమా పాత్రకు, లోఫర్ చిత్ర పాత్రకు మధ్య చాలా తేడా ఉందని ఆయన అన్నారు.

కంచె దర్శకుడు క్రిష్, లోఫర్ దర్శకుడు పూరీ జగన్నాధ్ ల వర్కింగ్ స్టైల్ లో చాలా తేడా ఉందని అన్నారు.

పూరీతో కలిసి పని చేయడంలో చాలా సరదాగా సాగిపోతుందని, నటులకు ఆయన ఎంతో అవకాసం ఇచ్చి తమ నుంచి తనకు కావలసినది రాబట్టుకుంటారని, మరోవైపు క్రిష్ మాత్రం తాను అనుకున్నట్టు నటులు నటిస్తేనే తృప్తి పడతారని, అప్పటి వరకు ఆయన విశ్రమించరని వరుణ్ తేజ్ అన్నారు.

వరుణ్ తేజ్ కు ఈ ఏడాది కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు.

కంచె సినిమా తనను ఒక నటుడిగా ప్రేక్షకుల ముందు నిలబెట్టిందని, అది మార్పుకు సంకేతమని ఆయన చెప్పారు. ప్రేక్షకులు మార్పును కోరుకుంటున్నారు అనడానికి కంచె చిత్రం ఒక మంచి ఉదాహరణ అని తెలిపారు.

తనను వెతుక్కుంటూ చాలా పాత్రలు వస్తున్నాయని, వాటిలో కొన్ని మంచి , ఆసక్తికరమైన పాత్రలు కూడా ఉన్నాయని, వాటిని ఎన్నుకోవడంలో తాను బిజీగా ఉన్నట్టు వరుణ్ తేజ్ అన్నారు. తన తదుపరి ప్రాజెక్టుని త్వరలోనే ఖరారు చేస్తానని కూడా చెప్పారు.

Send a Comment

Your email address will not be published.