మంచు విష్ణుకి చెంపదెబ్బ

మంచు విష్ణు తిన్న చెంప దెబ్బ విషయం హైదరాబాదులోని ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. పైగా తమ సొంత సినిమా సందర్భంగా విష్ణు చెంప దెబ్బ తినడమేమిటని చెవులు కొరుక్కుంటున్నారు. విషయంలోకి వద్దాం…..

మంచు విష్ణు, కాథరీన్ ట్రెసా జంటగా నటిస్తున్న ఎర్ర బస్ సినిమా చిత్రీకరణ హైదరాబాదులోని రామానాయుడు స్టుడియోలో సాగుతోంది. ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహిస్తున్నారు.

చిత్ర కథ ప్రకారం ఒక సన్నివేశంలో మంచు విష్ణుని నాయిక కాథరీన్ ట్రెసా చెంపదెబ్బ కొట్టాలి. మొదట్లో ఈ సన్నివేశానికి ఇద్దరూ కాస్తంత సిగ్గుతో అయోమయంలో పడ్డారు. చెంపదెబ్బ సన్నివేశామా అని ఆలోచనలోపడ్డారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణ రావు సందర్భాన్ని చెప్పి ఈ సన్నివేశానికి విష్ణుని, కాథరీన్ ని సమ్మతింప చేసారు. అప్పుడు కాథరీన్ విష్ణుని చెంప దెబ్బ కొడుతుంది. ఈ సన్నివేశం బాగా వచ్చినట్టు సన్నిహిత వర్గాల భోగట్టా.

ఎర్ర బస్ సినిమా “మంజప్పై అనే తమిళ్ చిత్రానికి రీమేక్. ముఖ్యంగా తాతా మనవడి సంబంధాల మధ్య కథంతా సాగుతుంది. కాథరీన్ ఓ మెడికల్ విద్యార్ధినిగా నటిస్తోంది.

Send a Comment

Your email address will not be published.