మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో చెప్పండి

అభిషేక్ బచ్చన్ దంపతులు విడిపోతున్నారని మీడియాలో కొంతకాలంగా వస్తున్న వార్తలకు తెర దించుతూ ఒక కొత్త సమాచారం వెలువడింది. ఐశ్వర్యరాయ్ తో తన బంధం గాడంగానే ఉందని అభిషేక్ బచ్చన్ స్పష్టం చేసారు. ఇక మా వైవాహిక బంధంపై రాతలు కట్టిపెట్టండి అంటూ ఆయన మీడియాకు గట్టిగానే చెప్పారు.

అభిషేక్ దంపతులు విడిపోబోతున్నారని మీడియాలో వచ్చిన ఒక వార్త దావానలంలా వ్యాపించింది. ఆ వదంతులకు పులుస్టాప్  పెట్టకపోతే  బాగుండదనుకున్న అభిషేక్ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో మీడియాను వ్యంగ్య ధోరణిలో విమర్శించారు అభిషేక్ బచ్చన్.

“ఓకే….నేనిప్పుడు విడాకులు తీసుకోబోతున్ననన్న మాట….ఆ విషయం నాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. విడాకులు తీసుకోబోతున్న నేను మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో కూడా మీరే చెప్తే బాగుంటుంది…థ్యాంక్స్…” అని.

ఈ మాటలు బట్టి తెలుసుకోవచ్చు అభిషేక్ –  ఐశ్వర్యల మధ్య ప్రేమ బంధం ఎంత గాడంగా ఉందోనని….. బాలీవుడ్ లో ఈ ప్రేమ జంట బాగానే ఉందని  తెలుసుకోవాలి.

ఇదంతా బాగానే ఉన్నా  ఐశ్వర్య, జయా బచ్చన్ ల మధ్య ఎంత వరకు సఖ్యత ఉందనేది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉందట…ఇదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

Send a Comment

Your email address will not be published.