మళ్ళీ వస్తున్న వడ్డే నవీన్

దాదాపు ముప్పై సినిమాల్లో కథానాయకుడిగా నటించిన వడ్డే నవీన్ మళ్ళీ వస్తున్నారు….

దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఏ సినిమాలోను కనిపించని నవీన్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చే ఒక సినిమాలో విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందు ఉంటారు అని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

“జగపతి బాబు,, మరికొందరు నటులను చూసిన తర్వాత వడ్డే  నవీన్ కూడా భిన్నమైన పాత్రలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చి తిరిగి వెండితెరపై కనిపించాలని అనుకున్న క్షణంలోనే రామ్ గోపాల్ వర్మ, మంచు లక్ష్మి కలిసి తమ సినిమాలో ఆయనకు తమ సినిమాలో అవకాశం ఇచ్చారు” అని ఆ వర్గాలు తెలిపాయి.

మరోవైపు మంచు విష్ణు తదితరులు నటిస్తున్న మరో చిత్రంలోనూ వడ్డే నవీన్ కి అవకాశం దక్కినట్టు కూడా తెలిసింది.

Send a Comment

Your email address will not be published.