మాది అరేంజ్డ్ మ్యారేజ్

పెద్దలు కుదుర్చిన పెళ్ళితో ఓ ఇంటి వాడు కానున్న హీరో ఆది ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రేమించిన తర్వాతా పెళ్లి చేసుకోకపోవడం తప్పని అన్నారు. తనది ప్రేమ పెళ్లి కాదని, అరేంజ్డ్ మ్యారేజ్ అని స్పష్టం చేసాడు.

ఆది కాబోయే భార్య పేరు అరుణ. ఆమె బీ టెక్ చదివింది. ఆమెకున్న ప్లస్ పాయింట్ ఎదుటివారిని అర్ధం చేసుకునే మనస్తత్వం కలిగి ఉండటమని ఆది చెప్పారు. మా ఇంట ఆమె కలిసిపోయిన తీరు నాకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆది – అరుణల పెళ్లి వచ్చే నెల హైదరాబాదులో జరగబోతోంది.

ఆది నటించిన ‘రఫ్’. సినిమాలో అతని సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. అభిలాష్ మాధవరం నిర్మాణంలో సుబ్బారెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా వినోదాత్మకంగా ఉంటుందని చెప్తూ ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం పెళ్లి చేసుకోకుండా విడిచిపెట్టడం తప్పని ఆది అన్నారు. ఈ ఇతివ్రుత్తంతోనే ‘రఫ్’ సినిమా తెరకెక్కినట్టు ఆయన అన్నారు.

చెప్పుకోదగ్గ రీతిలో అభిమానులు ఉన్న రకుల్ కున్న ఇమేజ్ ఈ సినిమాకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్తూ ఆమె ఈ సినిమాలో మంచి పాత్రలో నటించిందని అన్నారు. ఆమెకు డ్యాన్స్ కూడా బాగా వచ్చని ఈ సినిమాలో రెండు పాటలకు ఆమె చేసిన డ్యాన్స్ రుజువు చేస్తుందని చెప్పారు.

దర్శకుడు సుబ్బారెడ్డి తనకున్న అనుభవం అంతా ‘రఫ్’ సినిమాలో చూపించారని, ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆది అన్నారు.

ఈ సినిమాకి శ్రీహరి గారు ఒక గొప్ప ఆయుధమని, ఆయన రకుల్ ప్రీత్ సింగ్ కి సోదరుడిగా నటించారని, ఆయన క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు ఎంతో త్రిల్ గా ఫీల్ అవుతారని ఈ సినిమా ఆయని గొప్ప వీడ్కోలు చిత్రంగా తానూ భావిస్తున్నానని ఆది చెప్పారు.

Send a Comment

Your email address will not be published.