'రభస' కూడా రసాభాసా?

 

 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కోసం ఎన్.టి.ఆర్. ప్రయత్నిస్తున్నారని ఇప్పుడు ఫిలిం నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ప్లాప్ కావడంతో ఎన్.టి.ఆర్ తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారట. దమ్ము, బాద్షా, రామయ్యా వస్తావయ్యా వరుసగా మూడు డిజాస్టర్లు రావడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అందుకే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘రభస’ సినిమాలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేసారట.

మరి రభస అన్నా హిట్ అవుతుందా ? కాక పోతే పరిస్థితి ఏమిటి అనే విషయాలపై ఎన్.టి.ఆర్ తెగ వర్రీ అవుతున్నాడట. అందుకని వరుస హిట్లతో మంచి పీక్ స్టేజ్లో ఉన్న త్రివిక్రమ్ తో జత కట్టాలని భావిస్తున్నాడు. అందుకోసం త్రివిక్రమ్ తో సంప్రదింపులు కూడా జరుగు తున్నాయని, అయితే పవన్ కళ్యాణ్ తో మూడో సినిమా కోబలి తీయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్న నేపధ్యంలో ఎన్.టి.ఆర్ ప్రయత్నాలు ఏమేరకు సక్సస్ అవుతాయో అని సినీ జనం భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.