"లింగా"..కొన్ని విశేషాలు...

రజనీకాంత్ 64వ పుట్టినరోజు జరుపుకున్న ఈ నెల 12వ తేదీన లింగా సినిమా ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్ లలో విడుదల అయ్యింది.
ఈ చిత్రానికి దర్శకుడు కె ఎస్ రవికుమార్. నిజానికి ఈ సినిమాకి వెంకయ్య అని వేరే పేరు ఉండేది. దర్శకుడు రవికుమార్ ఈ పేరు ఎలా ఉంటుందని అడిగినప్పుడు రజనీకాంత్ బాగానే ఉందని చెప్పినప్పటికీ మరింత పవర్ ఫుల్ టైటిల్ ఉంటే బాగుంటుందని అన్నారు దర్శకుడితో. కొన్ని రోజుల తర్వాత రజనీకాంత్ లింగా అనే టైటిల్ బాగుంటుందని రవికుమార్ తో చెప్పారు. చివరికి లింగా పేరు ఖరారు చేసారు.
లింగా అనే పేరు ఖాయమవడంతోనే ఆ తర్వాత ఈ సినిమా పనులన్నీ చకచకా  జరిగిపోతాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. లింగా అనే టైటిల్ నమోదు చేసినప్పుడు ఆ టైటిల్ అప్పటికే నమోదు అయినట్టు, అమీర్ నాలుగేళ్ల క్రితం ఆ టైటిల్ ని బుక్ చేసుకున్నారని, రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా లింగా సినిమా చేయడానికి టైటిల్ నమోదైనట్టు చెప్పారు. అయితే రవికుమార్ తన ఫేవరిట్ స్టార్ రజనీకాంత్ తో లింగా సినిమా తీయాలని తెలియడంతోనే అమీర్ తన ప్రాజెక్టుని మార్చుకున్నారు. దానితో రజనీకాంత్ సినిమాకు లింగా టైటిల్ నమోదైంది.
లింగా అనే పేరు రజనీకాంత్ మనవాడి పేరు. రజనీ కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ దంపతుల ముద్దు బిడ్డడే లింగా. రజనీకాంత్ కు తన మనవళ్ళు లింగా అంటేనూ ఆర్యన్ అంటేనూ ప్రాణం. అందుకే లింగా టైటిల్ ఖాయమవడంతోనే రజనీ ఆనందానికి అంతులేదు.
లింగా సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనాక్షి సిన్హా కి తమిళం కానీ తెలుగు కానీ అక్షరం ముక్క రాదు. అంతేకాదు తమిళం మాట్లాడినా అర్ధం చేసుకునే శక్తి అసలే లేదు. కనుక ఈ సినిమాలో ఆమెకు గొంతు అందించిన ఆమె ప్రముఖ గాయని చిన్మయి. అటు తమిళం, ఇటు తెలుగు లోను చిన్మయి సోనాక్షి సిన్హాకు డబ్బింగ్ చెప్పారు.
ఈ సినిమాలో ఒక పాటకి రజనీకాంత్ మూడు రకాల వేషాలలో కనిపించారు. ఆ పాటను మధన్ కర్కి రాసారు. అదొక లాటిన్ అమెరికన్ స్టైల్ లో సాగిన పాట. ఈ పాటను మనో, నీతీ మోహన్, తన్వీ పాడారు. జ్యాక్ స్పారో, రాబిన్ హుడ్, టాం క్రూయీ వేషధారణలో రజని కనిపించారు.
రజనీకాంత్ ను ప్రవేశ పెట్టే సన్నివేశం ర్యాప్ స్టైల్ లో చిత్రీకరించారు. రజనీ ఈ విధంగా కనిపించడం ఆయన కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ పాటను ఆర్యన్ దినేష్ కనకరత్నం పాడారు. ప్రముఖ కవి వైరముత్తు ఈ పాటను రాశారు. ఈ పాటకు రజనీ కొన్ని సూచనలు చేసారు.
లింగా సినిమా షూటింగు మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేసారు. ఈ ఏడాది మే నెలలో ప్రారంభమై ఆరు నెలల్లో షూటింగ్ ముగిసింది. ఈ విషయం తెలియడంతోనే దర్శకుడు శంకర్ రోబో సినిమాను బిజినెస్ పరంగా ఇది దాటిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఈ సినిమా నిర్మిస్తున్నప్పుడు రజనీకాంత్ ఒక షరతు పెట్టారట. ఎత్తి పరిస్థితి లోను ఈ సినిమాను ఈ ఏడాది లోపే విడుదల చెయ్యాలని. ఆయన అనుకున్నట్టే ఈ సినిమా ఈ ఏడాది లోపే విడుదల అయ్యింది.
.
ఈ సినిమా పంపిణీ హక్కులు దాదాపు రెండు వంద కోట్ల వరకు ఉంది.
ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రకు అరవై కోట్లు ఇచ్చినట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.