వరుణ్ గట్టి నమ్మకం

విజయమో పరాజయమో ఏదో రకంగా టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటూ ఉన్న నటుడు వరుణ్ సందేశ్.

అదేం పాపమో వరుణ్ సందేశ్ నటించిన ఇటీవలి కొన్ని చిత్రాలు హిట్టు కాలేదు.

తన చిత్రాలు అనుకున్నంతగా విజయం సాధించడం లేదని తెలిసినా వరుణ్ సందేశ్ ఎప్పటికప్పుడు తన తదుపరి చిత్రం తప్పకుండా వంద శాతం హిట్టవుతుందని అనే గట్టి నమ్మకంతోనే నటిస్తున్నాడు.

ఈ మధ్య వచ్చిన తన సినిమా “పడ్డానండీ ప్రేమలో మరి” మీద వరుణ్ సందేశ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. తీరా అది విడుదలై మామూలుగానే ఉందని ప్రేక్షకులు పెదవి విరవడంతో వరుణ్ అయోమయంలో పడ్డాడు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం విడుదల అయిన సమయంలోనే వరుణ్ సందేశ్ నటించిన  ‘పడ్డానండీ ప్రేమలో మరి’  రావడం వల్లే సరిగ్గా ఆడలేదనే వారున్నారు. ఆ మాట ఎలా ఉన్నా వరుణ్ సందేశ్  ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొబోతున్నాడు. తాజాగా వరుణ్ సందేశ్ లవకుశ చిత్రంతో ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన రిచా పనయ్ నటిస్తోంది.

ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ రెండు పాత్రలలో నటిస్తున్నాడు.

చూడాలి మరి వరుణ్ సందేశ్ లవకుశ ఏ మేరకు ఆడుతుందో….

Send a Comment

Your email address will not be published.