వినోదాత్మకమే "డిక్టేటర్"

మళ్ళీ పూర్తి వినోదాత్మక కథనంతో మన ముందుకొచ్చాడు బాలకృష్ణ డిక్టేటర్ రూపంలో.

అంజలి, సోనాల్ చౌహాన్, రతి అగ్నిహోత్రి, కబీర్ ఖాన్, విక్రమ్ జీత్ మాలిక్, నాజర్ , పృథ్వీ, సుమన్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, షాయాజి షిండే తదితరులు నటించిన డిక్టేటర్ చిత్రానికి
నేపథ్య సంగీతం చిన్నా సమకూర్చగా తమన్ పాటలు స్వరపరిచారు.

కథ, స్క్రీన్ ప్లే కోన వెంకట్, గోపీ మోహన్ అందించగా మాటల రచయిత రత్నం.
రచన పరంగా శ్రీధర్ సీపాన కూడా సహకరించారు.

ఎరోస్ ఇంటర్నేషనల్ వేదాశ్వ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు.

ఇరవై నాలుగు గంటల తేడాలో బాబాయి, అబ్బాయిలు సంక్రాంతి పండగ కానుకగా తమ తమ అభిమానుల వద్దకు వచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ చిత్రం నాన్నకు ప్రేమతో ఎమోషన్స్ తో కూడుకుంటే బాలకృష్ణ ‘డిక్టేటర్’ వినోదాత్మకమైనది.

చందు పాత్రలో బాలకృష్ణ నటించిన ఈ చిత్రంలో భాగ్యనగరంలో తన మామ ఇంట్లో ఉంటూ ఓ సూపర్ మార్కెట్లో సూపర్ వైజర్ గా పని చేస్తూ ఉంటాడు. అతని భార్యేమో దేశ రాజధానిలో ఉంటుంది.

ఓ రోజు చందుకి సూపర్ మార్కెట్లో అనుకోకుండా సోనాల్ చౌహాన్ పాత్రలో నటించిన ఇందు పరిచయమవుతుంది. ఆమెను ఇబ్బందుల్లోంచి కాపాడే క్రమంలో చందు ఓ మంత్రి కుమారుడితోపాటు అతడి ముఠాని ఖతం చేస్తాడు. దీంతో అతణ్ని ఎన్ కౌంటర్ చేయడానికి పోలీసులు సిద్ధమవుతుండగా.చందు ఎవడనే నిజం బయటపడుతుంది. ఇలా చందు మీదే నడిచిన ఈ కథలో అతనెవడు? అతని పూర్వ చరిత్ర ఏమిటి? దేశ రాజధానిలో అతని భార్య చేసేదేమిటి? వంటి వివరాలు తెలుసుకోవాలంటే డిక్టేటర్ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

అక్కడక్కడా కాస్త కామెడీ ఉన్నా, హీరోయిన్ల గ్లామర్ చూడగలుగుతున్నా ఈ చిత్రం పూర్తి వినోదాత్మక మైనదే. బాలకృష్ణ హీరోయిజం సినిమాకు వెన్నెముక. ముఖ్యంగా సోనాల్ తన అందంతో తెగ ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. బాలక్రిష్ణ, రతి అగ్నిహోత్రి ల మధ్య సన్నివేశాలు బాగా పండాయి.
బాలకృష్ణ తనదైన పంచ్ డైలాగులతో అభిమానుల చప్పట్లు అందుకున్నాడు. అంజలి పాత్రను ఇంకాస్త బాగా చూపాల్సింది.

పాటల్లో వాట్సాప్ బేబీ చుర చుర మినహాయిస్తే మిగిలినవి ఓ మోస్తరుగా ఉన్నాయి. ఆహా ఓహో అని చెప్పలేము.

Send a Comment

Your email address will not be published.