వీరేశలింగం కాదన్న బీ ఎన్

ఒకసారి ఫిల్మ్స్ డివిజన్ వాళ్ళు వీరేశలింగం పంతులు సబ్జెక్టు పై ఒక ఫిలిం తీయమని బీ నాగిరెడ్డి గారిని అడిగారు. అప్పుడు ఆయన వాళ్లకు ఒక ఉత్తరం రాసారు.

“మీరు అడుగుల లెక్కన తీయాలి. మేము ఎడిట్ చేసుకుంటాం. దానికి లెక్క కట్టి డబ్బులు ఇస్తాం” అని ఫిల్మ్స్ డివిజన్ వాళ్ళు చెప్పారు. దానికి బీ ఎన్ రెడ్డి గారు ” నేను తీసిన తర్వాత మళ్ళీ మీరెందుకు ఎడిట్ చెయ్యాలి? ” అని ప్రశ్నించారు. అలాగే ఆయన మరో మాట కూడా చెప్పారు – “సత్యజిత్ రే రవీంద్రనాథ్ టాగోర్ జీవితం మీద చిత్రం తీసారు మీకు. ఆయనకు ఎంత డబ్బు ఇచ్చారో నాకూ అంత ఇస్తే తీస్తాను” అని బీ ఎన్ రెడ్డి గారు అన్నారు. అప్పుడు వాళ్ళు అరవై వేలు ఇచ్చారు. ఈ డబ్బుకి తాను వీరేశలింగం సబ్జెక్టు తీయలేనని, మరో అరవై వేలు తమ ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటానని, దాని మీద కూడా ఇంకా డబ్బు అవసరమైతే తమ కంపెనీ వాహిని సంస్థ నుంచి కూడా కొంత డబ్బు వేసుకుని మంచిగా తీస్తానని బీ ఎన్ రెడ్డి చెప్పారు.

“తెలుగు వారికి వీరేశలింగం ముఖ్యమైన వ్యక్తి. పైగా వివాదాస్పదమైన సబ్జెక్టు. పది మందితో చర్చించి స్క్రిప్ట్ చేయడానికి టైం తీసుకుంటుంది. వీరేశలింగం గారి హోదాకు తగినట్టు ఈ ఫిలిం తీయాలి. తీస్తాను కూడా. ఇందులో ఏ లోపం ఉండదు” అని బీ ఎన్ రెడ్డి గారు తమ ఉత్తరంలో పేర్కొన్నారు.

అయితే ఫిల్మ్స్ డివిజన్ వాళ్ళు ఇరవై వేల కంటే ఎక్కువ ఇవ్వలేమన్నారు.

దానితో బీ ఎన్ రెడ్డి ఊరుకోగా, ప్రసాద్ ఇరవై వేలకే తీస్తానని ఒప్పుకున్నారట. అన్నట్టుగానే ఆయన తీసారు కూడా. కానీ ఆ పిక్చర్ ఎక్కడ పది ఉందో కూడా ఎవరికీ తెలియదని బీ ఎన్ రెడ్డి దాదాపు నలభై ఒక్క ఏళ్ళ క్రితం ఒకానొక ముఖాముఖి లో చెప్పిన విషయాలివి.

Send a Comment

Your email address will not be published.