వెండితెరపై షకీలా చరిత్ర

ఒక నటి తెర వెనుక జీవితం ఆధారంగా తీసిన చిత్రంలో ఆమధ్య విద్యాబాలన్ నటించగా దానిపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు ది డర్టీ పిక్చర్స్. ఈ  సినిమా ఎలాంటిదైనా విద్యాబాలన్ పేరు మాత్రం టాలీవుడ్ లో మారుమోగింది. అటువంటి చిత్రాలు తీయడానికి కొందరు నిర్మాతలు పోటీ పడుతున్నారు. సెక్సీ తారగా పేరు పొందిన షకీలా ఇటీవల తన జీవిత చరిత్రను రాసారు. ఆమె రాస్తున్నారని తెలిసినప్పుడే కొందరు ఆమెను సంప్రదించారు. ఆ పుస్తకం ఆధారంగా ఒక సినిమా తీస్తే బాగుంటుందని వారి ఆలోచన. అయితే ఈ చిత్రంలో ఎవరు నటిస్తే బాగుంటుందని ఆలోచించిన ఒక నిర్మాత నటి అంజలిని కలిసి విషయం చెప్పగా అందుకు ఆమె సరేనన్నట్టు భోగట్టా.

Send a Comment

Your email address will not be published.