శ్రీదేవితో సుదీప్ లిప్ లాకా?

వెండితెరపై ఒకప్పుడు ఆమె కనిపిస్తే చాలు కుర్రకారు రెచ్చిపోయేవారు.  యువత ఈలలు వేసి గోలగోల చేసేవారు. ఇంతకూ ఆ నటి ఎవరో చెప్పలేదు కదూ …ఆమె మరెవరో కాదు ఒకప్పటి వెండితెర సుందరి శ్రీదేవి. ఆమె లిప్ లాక్కు ఒకే చెప్తే ఏ హీరో అయినా ఆగుతారా? వద్దంటారా? ముందువెనుకలు చూడక నేను రెడీ అని ముందుకు రారు.

అయినా అసలు విషయానికి వద్దాం…

ఇప్పటికే వచ్చేసిన  ‘పులకేసి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన శంకర్ శిష్యుడే శింబుదేవన్. ఇప్పుడు శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్న “పులి” అనే తమిళ  చిత్రంలో కన్నడ స్టార్ సుదీప్‌తో శ్రీదేవి లిప్‌లాక్‌ కు ఓకే చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంకేముంది, దేశమంతా ఈ ముద్దు సీనుపైనే  చర్చ.  దేశంలో ఒకటే కలకలం.

కానీ శ్రీదేవితో లిప్ లాక్ అనే వార్త అబద్ధమని సుదీప్‌ కొట్టిపారేశాడు. మీడియాలో వచ్చిన వార్తలు కేవలం వదంతులేనని సుదీప్ అన్నారు. అంతేకాదు చిత్ర యూనిట్ కూడా ఈ రకమైన సన్నివేశంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. కానీ మరి ఎక్కడి నుంచి ఈ వార్త గుప్పుమందో తెలియడం లేదు.

పైగా వయస్సుల విషయానికి వస్తే, అందాల నటి శ్రీదేవి వయస్సు యాభై పైనే కాగా సుదీప్ వయస్సు నలభై పైచిలుకు ఉంది. వీరి మధ్య దాదాపు పదేళ్ళ తేడా ఉంది.

ఈ పులి చిత్రంలో సుదీప్, శ్రీదేవి జోడీగా నటిస్తున్నారా లేదా అన్నది కూడా ఇంకా ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ వీరి మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉన్నట్టు ఎలా వదంతులు పుట్టుకొచ్చాయో అంతుపట్టడం లేదు. ఇద్దరు పిల్లల తల్లైనా శ్రీదేవి వయస్సులో తనకన్నా పదేళ్లు చిన్నవాడైన  సుదీప్‌తో లిప్ లాక్‌కు అసలు ఒప్పుకుంటుందా అని ప్రశ్నించేవారున్నారు. .

ఇలా ఉండగా ఈ చిత్రంలో హీరో  విజయ్ మూడు పాత్రల్లో కనిపిస్తాడని వచ్చిన వార్తను చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. విజయ్ యువరాజు, మరగుజ్జు, ప్లేబాయ్‌ అంటూ మూడు పాత్రల్లో నటిస్తాడని కొన్ని రోజుల క్రితం ఒక వార్త వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో విజయ్ జోడీగా  హన్సిక, శ్రుతి హాసన్ నటిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.