సావిత్రి పాత్రలో సమంతా!

నటి సమంతా తాను నటించబోయే రెండు తెలుగు చిత్రాల గురించి త్వరలో వెల్లడించనుంది. ఇప్పటికే ఆమె మూడు తమిళ చిత్రాలకోసం ఒప్పందంకూడా చేసుకుంది కూడా.

నటి సావిత్రి చరిత్ర ఆధారంగా తీయబోయే చిత్రంలో ఆమె కథానాయిక పాత్ర పోషించబోతోంది.

ఈ చిత్రానికి దర్శకుడు ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం “నాగ అశ్విన్.

సమంతా సన్నిహిత వర్గాల వల్ల తెలిసిన విషయం….

“ఇప్పటికే ఎందరో పలు ప్రాజెక్టులతో ఆమెను కలుస్తున్నారు. కానీ ఆమె స్క్రిప్ట్స్ ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు….”

తమిళంలో శివ కార్తికేయన్ తో ఇప్పటికే ఒక సినిమాకు ఒప్పందం చేసుకున్న సమంతా విశాల్ తోకూడా ఒక సినిమా చేస్తున్నాది. అలాగే తమిళ సూపర్ స్టార్ విజయ్ తో మరో సినిమా చేయబోతోంది. ఈ చిత్రాలే కాకుండా తెలుగులో రెండు చిత్రాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారబోతోంది. కన్నడంలో వచ్చిన యు టర్న్ చిత్రాన్ని తెలుగులో పునర్ నిర్మించడానికి ఒక వైపు నిర్ణయం జరిగినప్పటికీ అందులో నటించేందుకు ఆమె ఇంకా సంతకాలు చేయలేదని తెలిసింది.

జనతా గ్యారేజ్ తర్వాత ఆమె టాలీవుడ్ నుంచి కాస్త విశ్రాంతి తీసుకుంది. పెళ్లి గురించి కూడా ఒక ప్రకటన చేసింది కూడా.
సమంతా మాట్లాడుతూ ప్రస్తుతం అన్నీ గాడిన పడ్డాయాని, వ్యక్తిగతంగా కూడా తాను హ్యాపీగా ఉన్నానని తెలిపింది. వృత్తిపరంగా కూడా హాయిగా ఉన్నానని ఆమె చెప్పింది.

Send a Comment

Your email address will not be published.