సిక్స్ ప్యాక్

అల్లు అర్జున్ దేశముదురు సినిమా కోసం సిక్స్ ప్యాక్ తో టాలీవుడ్ లో ప్రేక్షకులముందుకు వచ్చిన తొలి నటుడు అనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలామంది నటులు కండ బలం ప్రదర్శిస్తూ నటిస్తున్నారు. ఇప్పుడు అల్లు శిరీష్ తన వంతుగా సిక్స్ ప్యాక్ తో ముందుకొస్తున్నారు. తన సిక్స్ ప్యాక్ కు అన్నయ్య అర్జునే ప్రేరణ అని శిరీష్ చెప్పారు. తన అన్నయ్య నటించిన దేశముదు సినిమా చూసినప్పటినుంచి తానూ కూడా తన బాడీ ఫిట్నెస్ కోసం కృషి చేశానని శిరీష్ అన్నారు. అందుకు తానూ అన్నయ్య బన్నీకి థాంక్స్ చెప్తున్నానని ఆయన తెలిపారు.

శిరీష్ ఏ ఒక్క ట్రైనర్ పర్యవేక్షనలోను సిక్స్ ప్యాక్ చేపట్టలేదు. తనకు తానుగా ఈ క్రమంలో కృషి చేసినట్టు శిరీష్ చెప్పారు. సిక్స్ ప్యాక్ విషయం డైట్ ప్రధానమని, అంతే తప్ప ఒక్క వ్యాయాయం మాత్రమె సరిపోదని తెలిపారు. ప్రోటీన్ లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ కార్బో డైట్ తగ్గించానని చెప్పారు. ఇలా రెండు నెలల పాటు తగు క్రమంలో అవసరమైన జాగర్తలు తీసుకోవడంతో సిక్స్ ప్యాక్ సాధ్యమైందని అన్నారు. తనకు అవసరమైన టిప్స్ ఇంటర్నెట్ ద్వారా తీసుకున్నానని చెప్తూ తన కొత్త సినిమాకి పూర్తిగా న్యూ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఉందని అన్నారు. అందుకే ఫిట్నెస్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చానని చెప్పారు. తాను నటిస్తున్న కొత్త చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

Send a Comment

Your email address will not be published.