22 రోజులకు 15 కోట్లు

ఆశ్చర్యపరచడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. అవును…పవన్ కళ్యాణ్ గోపాలా గోపాలా చిత్రంలో కేవలం 25 నిముషాలు తెరపై కనిపించడానికి అడిగిన సొమ్ము అక్షరాలా పదిహేను కోట్ల రూపాయలు.

ఓ మై గాడ్ అని హిందీలో వచ్చిన చిత్రాన్ని తెలుగులో గోపాలా గోపాలా పేరుతో రీమేక్ చేస్తున్నారు. హిందీలో అక్షయ్ కుమార్ కృష్ణుడి పాత్ర ధరించారు. తెలుగులో ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు.

మొదట్లో ఈ సినిమాలో నటించడానికి 15 రోజులకు 15 కోట్ల రూపాయలు అడిగారు పవన్ కళ్యాణ్ . అంటే రోజుకు కోటి రూపాయలన్న మాట. అయితే చిత్ర నిర్మాత డీ సురేష్ బాబు 22 రోజులు షూటింగుకి రావాలని కోరారు. రోజులపై పట్టుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని సడలించి 22 రోజుల వర్కుకి ఒప్పుకున్నారు. అంటే పవన్ 22 రోజుల పనికి తీసుకోబోయే సొమ్ము పదిహేను కోట్ల రూపాయలన్న మాట.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్టు కూడా వేసారు.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కృష్ణ భక్తుడిగా నటిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.