అడిలైడ్ లో దీపావళి సంబరాలు

సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం దీపావళి సంబరాలు అత్యంత వైభవంగా ఈ నెల 2వ తేదీన అడిలైడ్ నగరంలో స్థానిక మంత్రులు, పలువురు పార్లమెంటు సభ్యులు మరియు ఎంతోమంది మల్టీ కల్చరల్ సంఘ సభ్యులు, తెలుగు సంఘంలోని ప్రముఖుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రీయ నృత్యాలతో పాటు బాలీవుడ్ నృత్యాలు, కిడ్స్ ఫాషన్ షో, పేస్ పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలు ఇంకా ఎన్నో పాటల కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమానికి ముందుగా జ్యోతిని భారతదేశం నుండి వచ్చిన పెద్దవారిచేత వెలిగించడం ఇక్కడి తెలుగు సంఘం ఆనవాయితీ. ఈ ప్రక్రియలో అడిలైడ్ నగరానికి వచ్చే క్రొత్త వారిని పరిచయం చేయడం కూడా ఒక ఆనవాయితీ. ఇలా వచ్చిన క్రొత్త వారిని ఆహ్వానించడంతో పాటు తమలో భాగంగా ఇముడ్చుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయం. కౌశిక్ పాడిన ప్రార్ధనా గీతంతో ప్రారంభమైన సందడి చివరి వరకూ ఎంతో ఆహ్లాదంగా షుమారు ౩౦౦ మంది తెలుగు వారు ఎన్నో సార్లు నెమరువేసుకునే విధంగా కొనసాగింది.

తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ యార ఆదిరెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు సంఘం విలువలు మరియు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ సభ్యులందరూ కలిసికట్టుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ దీపావళి అమావాస్య రోజు బయట చీకటి కమ్ముకున్నా ప్రభుత్వ ప్రతినిధులనే తారలతో ఈ వేదిక తారాజువ్వలా వెలిగిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అతిదులకు, స్పాన్సర్లకు, మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

తదుపరి జిమ్మి డాన్స్ గ్రూప్ చేసిన బాలీవుడ్ నృత్యం, కిరణ్ పాడిన పాట, కాశ్యప్ చేసిన నృత్యం, కిడ్స్ ఫాషన్ షో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముద్ర డాన్స్ గ్రూప్ చేసిన బాలీవుడ్ డాన్స్ ఎంతో ఆకర్షణీయంగా వుంది.
శ్రీ కైలాష్ నాథ్ గారు ఎంతో సంగ్రహంగా వినసొంపుగా దీపావళి పండుగ ప్రాశస్త్యం వివరించారు. శ్రీ కైలాష్ నాథ్ గారు అడిలైడ్ నగరంలో తెలుగు సంఘం నిర్వహించే ఏ కార్యక్రమానికైనా ఒక మూల స్థంభంలా నిలిచి సమూలమైన కార్యనిర్వహణ బాధ్యతను నిర్వహిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడి తెలుగు సంఘానికి వెన్నెముక లాంటి వారు.

 

ఈ కార్యక్రమానికి క్రింద పేర్కొనబడిన ముగ్గురు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. వీరందరూ కలిసి క్రొవ్వోత్తులను వెలిగించి దీపావళి పర్వదినాన్ని తమ ప్రశంసలతో వెలుగు నింపారు.
Hon. Jennifer Rankine (Minister for Education and Child Development and Minister for Multicultural Affairs)
Hon. David Pisoni (Liberal State member for Unley)
Hon. David Pisoni (Liberal State member for Unley)

వీరే కాకుండా దిగువున పేర్కొన్న ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(a) Hon. Michael Atkinson (Speaker of the house of assembly)
(b) Hon. Russell Wortley MLC
(c) Hon. Ms Dana Wortley (Former Senator)

డ్రాయింగ్ పోటీలో విజేతలు : విషిత, హర్షిత, నిరీక్ష నాయుడు మరియు సరస్వతి
కార్యకర్తలకు గుర్తింపు: నితిన్, కార్తీక్, జ్యోతి, లక్ష్య, సుమ, నందు, శ్రీరాం, సూర్య, పృథ్వి మరియు రమ్య
ఫాషన్ షో విజేతలు: విషిత, హర్షిత (రస్సెల్ & దాన)
ఈ కార్యక్రమానికి హెమ్ మరియు శ్రీ వాచాస్పతులుగా వున్నారు.
శ్రీ శ్రీధర్ గారు ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది.

Send a Comment

Your email address will not be published.