అత్తారింటికి దారేది..రాజీనామా చేస్తేనే!

సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమంతో మెగా ఫ్యామిలీకి మెగా కష్టాలే వచ్చి పడ్డాయి. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం “అత్తారింటికి దారేది” సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోవడం లేదు. పవన్ స్టార్ సినిమా అంటే అభిమానులకు పండగే. “గబ్బర్ సింగ్”, “కెమెరామాన్ గంగతో రాంబాబు” వంటి వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మరోసారి హ్యాట్రిక్ సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నారు. జల్సాతో తనకు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో “అత్తారింటికి దారేది” లో శ్రీ పవన్ కళ్యాణ్ నటించారు. గ్లామర్ క్వీన్ సామంత మెయిన్ హీరోయిన్ గా, మరో హీరోయిన్ గా ప్రణీత నిన్నటి తరం నటీమణి నదియా అత్తగా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక పాట పాడటం. ఈ సినిమాలోని ఒక జానపద గీతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించారు. ఆ దృశ్యాన్ని యుట్యూబ్లో పెట్టిన వెంటనే ఎన్నో లక్షల లైక్ లు వచ్చాయి.

ఇన్ని అంచనాల మధ్య మన దేశంతో పాటు, అమెరికా, ఆస్త్రేలియ, పేరూ వంటి విదేశాల్లో సైతం భారీ ఎత్తున విడుదలకు సన్నాహమైన “అత్తారింటికి దారేది” పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మెగా స్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ప్రజల్లోకి వస్తే తప్ప చిరు ఫ్యామిలీ సినిమాలను ఆంధ్రలో విడుదల చేయడానికి వీల్లేదని సమైక్య వాదులు పంతం పట్టారు. చిరంజీవి అభిమానుల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 2009లొ ప్రజా రాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసారు. 2009 డిశంబరు 9న యు పి ఎ ప్రకటించిన తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లేవనెత్తారు. అయితే ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న చిరంజీవి కేవలం పదవి కోసమే సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను డిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఎంపి పదవికి రాజీనామా చేసి తిరిగి సమైక్య వాదానికి నాయకత్వం వహించాలని, అలా జరిగే వరకూ చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలేవీ ఆంధ్రలో విడుదల కానీయమని సమైక్యవాదులు గర్జిస్తున్నారు. దీంతో మొదట ఆగస్ట్ 9కి వాయిదా పడిన “అత్తారింటికి దారేది” …సినిమా ఎప్పుడు విడుదల కావాలో అర్ధంకాక ప్రస్తుతం బాక్సుల్లో భద్రంగా ఉంది.

1 Comment

  1. Andhra pradesh any oka pedda family ni vidadeesthe emavuthundi. Adi paapamla chuttukoni aayana kutumbanney thinesthundi. Being one telugu actor, knowing in and out about AP people’s feeling and social demand he supported separation of state, just for the his personal benefit. Silly thing is that he is bending down in front of congress leader. Shame shame. Before finishing I was a diehard fan of Chiru its sad to see that he is doing this to our state.

Send a Comment

Your email address will not be published.