అమరావతిలోనే ఉద్యోగ విధులు

ఈ నెల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నుంచే ఉద్యోగ విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అల్టిమేటం జారీ చేశారు.
ఎవరూ ఎటువంటి సాకులూ చెప్పడానికి వీల్లేదని ఆయన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. దాదాపు ఏడాది నుంచి ఆయన ఇదే మాట చెబుతుండడంతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే తమ కుటుంబాలను విజయవాడ పరిసర ప్రాంతాలకు తరలించారు. కాగా సుమారు ఇరవై వేలమంది ఉద్యోగులు ఈ నెల 27 లోగా విజయవాడ తరలాల్సి ఉంటుంది. అయితే విజయవాడ, గుంటూరు, మంగళగిరి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్ల అద్దెలు 75 శాతానికి పైగా పెంచేశారని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం హైద్రాబాద్ నుంచి మూడు ప్రత్యేక రైళ్లను విజయవాడకు ఏర్పాటు చేసింది. రోజుకు సుమారు ఆరు వేల మంది ఉద్యోగుల చొప్పున విజయవాడ వెళ్లడం మొదలయింది. ఉన్నతాధికారులు మాత్రం రెండు నెలల్లో విజయవాడ వెళ్ళడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది

Send a Comment

Your email address will not be published.