ఇప్పుడిక జగన్ వంతు

ఇంతకు ముందు పలువురు జాతీయ, ప్రాంతీయ నాయకులు చేసిన విఫల యత్నం ఇది. తాజాగా వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు వై.ఎస్.ఆర్. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఇది, దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయడం. గతంలో ములాయం సింగ్ యాదవ్, ఎన్.టి. రామారావు కూడా తృతీయ ఫ్రంట్ కోసం ప్రయత్నించారు. అయితే, ఇది ఏనాడూ విజయవంతం కాలేదని చరిత్ర చెబుతూనే ఉంది. కానీ జగన్ పట్టు వదలని విక్రమార్కుడు. ఆయన ఇటీవల దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ సమైక్య ఆంద్రకు మద్దతు కోసం అన్నట్టుగా కలుస్తూ, తృతీయ ఫ్రంట్ గురించి కూడా ప్రస్తావిస్తున్నారని తెలిసింది. ఇటీవల ఆయన ఢిల్లీ లో సమాజ్ వాది నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ను కూడా కలుసుకున్నారు. ఇటీవల అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఒక్క మిజోరం లో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుంది.

ములాయం సింగ్ ను కలిసిన తరువాత జగన్ జనతా దళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్.డి. దేవెగౌడను కూడా కలుసుకున్నారు. ఆయనతో సమైక్య ఆంధ్ర కు మద్దతు కోరుతూనే పనిలో పనిగా తృతీయ ఫ్రంట్ గురించి కూడా మాట్లాడారని తెలిసింది. కొద్ది రోజుల క్రితం జగన్ తమిళ్ నాడు ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి,  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కూడా కలుసుకున్నారు. తెలంగాణా బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని ఆయన వారందరికీ విజ్ఞప్తి చేశారు.

Send a Comment

Your email address will not be published.