ఏడాదిలో మెట్రో రైలు

metro hyderabadనగరంలో చేపట్టిన మెట్రో రైలు వ్యవస్థ ఒక ఏడాదిలో పూర్తి అయ్యిపూతుందని మెట్రో రైల్ ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూన్ రెండవ తేదీ నాటికి మొదటగా మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ వరకు ఈ రైలును నడుపుతామని తెలిపారు. మిగిలిన మార్గాల్లో కూడా వచ్ఛే ఏడాది మార్చి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి రైలును నడుపుతామని ఆయన చెప్పారు.

మెట్రో రైల్ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా, సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలో మెట్రో రైలు కోసం మెట్రో రైల్ ఓవర్ బ్రిడ్జి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ బ్రిడ్జిని పూర్తిగా స్టీలుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 8 రైల్వే ట్రాక్స్ ఉండగా, భవిష్యత్తులో మరో 5 రైల్వే ట్రాక్స్ నిర్మించడానికి వీలుగా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని రెడ్డి తెలిపారు. నదులు, కొండలు, లోయలు వంటి ప్రదేశాల్లో మాత్రమే నిర్మించే ఈ స్టీల్ బ్రిడ్జిని అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ లో కూడా నిర్మించాలని సంకల్పించామని ఆయన తెలిపారు. వచ్ఛే మే నాటికల్లా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.