కేంద్రంతో కిరణ్ డీ?

కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం

రాష్ట్ర విభజన బిల్లు సిద్ధమయింది. సుమారు 32 సవరణలు పూర్తి చేసుకున్న ఈ బిల్లు ఇక రాష్ట్రపతి భవన్ లో అడుగుపెట్టేందుకు రెడీగా ఉంది. 294 పేజీలు  ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2014’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఈ బిల్లు మీద మంత్రివర్గ సమావేశంలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. అనేక అంశాల మీద సీమాంధ్ర మంత్రుల అభ్యంతరాలు, దానికి కేంద్ర మంత్రుల బృందం సమాధానాలతో సమావేశం వేడెక్కింది. ఆంద్ర ప్రదేశ్ శాసనసభకు రాష్ట్రపతి పంపిన బిల్లులో కేంద్రం అధికారికంగా 32 సవరణలు చేసింది. సీమాంధ్రకు చెందినా మంత్రులు 10 డిమాండ్లు చేయగా అందులో 8 డిమాండ్లకు కేంద్రం ఆమోదం తెలిపింది.

హైదరాబాద్ నగరాన్ని కొంతకాలమయినా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర మంత్రులు పట్టుబట్టారు కానీ కేంద్రం అందుకు అంగీకరించలేదు. నగరం పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. రాయల  తెలంగాణా అనే ప్రతిపాదనను కేంద్ర తోసిపుచ్చింది. సీమకు, ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడానికి అంగీకరించింది. అలాగే, పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణా మంత్రులు అంగీకరించారు. హైదరాబాద్ నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు వాటా ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఈ బిల్లును మొదటగా ఈ నెల 12న రాజ్యసభలో ప్రవేశ పెడతారు.

కేంద్రంతో కిరణ్ డీ!

రాష్ట్ర విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన మరుక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసిన వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం గట్టి నిర్ణయంతో ఉంది. దేనికయినా రెడీ అని కిరణ్ ఇప్పటికే సవాలు విసిరారు. ఈ బిల్లును పార్లమెంట్లోప్రవేశ పెట్టక మునుపే కిరణ్ ను తొలగించాలని కేంద్రంలో కొందరు మంత్రులు పట్టుబడుతున్నారు. అయితే ఆయనను ముందుగా రాజీనామా కోరడం, ఆ తరువాత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వంటివి పాటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. పదవికి రాజీనామా చేయగానే తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుని ఆ తరువాత భవిష్యత్ కార్యక్రమం గురించి ఆలోచించాలని కూడా కిరణ్ భావిస్తున్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.