తెలంగాణాకు యాపిల్ వరాలు

తెలంగాణా రాష్ట్రంతో దీర్ఘకాలిక సంబంధాలు కోరుకుంటున్నానని అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ సి ఈ ఓ టిం కుక్ చెప్పారు. ఆయన యాపిల్ మ్యాప్స్ డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ నగరంలో ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో ప్రతిభకు లోటు లేదని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో నగరంలో యాపిల్ కార్యకలాపాలను మరింతగా పెంచుతామని ఆయన చెప్పారు. తమ సంస్థ ద్వారా ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన ప్రకటించారు. స్థానికి విశ్వవిద్యాలయాల సహకారంతో తమ సంస్థ కార్యకలాపాలను విద్యార్థులకు చేరువగా తీసుకు వస్తామని ఆయన చెప్పారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తమ సంస్థ ప్రపంచంలో 300 నగరాల్లో తమ కార్యకలాపాలను సాగిస్తోందని ఆయన తెలిపారు. హైదరాబాద్ కేంద్రాన్ని స్థానిక ఐ టీ సంస్థ ఆర్ ఎం ఎస్ ఐ భాగస్వామ్యంలో యాపిల్ నిర్వహించనుంది.

Send a Comment

Your email address will not be published.