తెలంగాణాలో మహిళా వర్సిటి

తిరుపతి తరహాలో మహబూబ్ నగర్ పట్టణంలో మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతిలో మాత్రమే మహిళా విశ్వ విద్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత తిరుపతి లోని పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. అయితే తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇటువతి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించాలని కె సి ఆర్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దీనిపై ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం యూ జీ సీతో కూడా చర్చలు జరుపుతోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టాలని, 2017 విద్యా సంవత్సరంలో ఈ విశ్వ విద్యాలయాన్ని తాత్కాలిక ప్రాతిపదికన అయినా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి సుమారు 25 వేల కోట్లు ఖర్చవుతాయని  అంచనా.

Send a Comment

Your email address will not be published.