నగరంలో మారణ హోమానికి కుట్ర

గత బుధవారం జాతీయ దర్యాప్తు బృందం అకస్మాత్తుగా నగరంలో ప్రవేశించి ఒక పెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. నగరంలో మూడు చోట్ల భారీగా పేలుళ్లు జరపడానికి ఉగ్రవాదులు కుట్ర చేశారని ఆ బృందం దాడిలో వెల్లడయింది. సుమారు యాభై మంది ఇస్లానిక్ స్టేట్ ఉగ్రవాదులు నగరంలోని హై టెక్ ప్రాంతాలయిన మాదాపూర్, బేగం బజార్, దిల్సుఖ్ నగర్ లలో భారీగా పేలుళ్లు జరపడానికి పెద్ద సంఖ్యలో మారణాయుధాలు పోగు చేసినట్టు తెలిసింది. తెల్లవారు ఝామున 4 గంటల ప్రాంతంలో పది చోట్ల ఆకస్మిక దాడులు జరిపిన దర్యాప్తు బృందానికి భారీగా పేలుడు సామగ్రి, విదేశీ నగదు, 15 లక్షల రూపాయల భారతీయ నగదు లభ్యమయ్యాయి. పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఆ తరువాత నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.