పుష్కరాలకు అంతా రెడీ

ఈ నెల 14 ఉదయం 6.30 గంటల నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు అటు తెలంగాణాలోనూ, ఇటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14న రాజమండ్రి దగ్గర గోదావరి నదిలో పుణ్య స్నానం ఆచరిస్తారు. అదే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కరీంనగర్ వద్ద గోదావరిలో పుణ్య స్నానాలు చేస్తారు. ఈ పుష్కరాలు ఈ నెల 25 వరకు కొనసాగుతాయి. ఈ నెల 14వ తేదీనీ రాజమండ్రిలో శృంగేరీ పీఠాదిపతి, కొవ్వూరులో కంచి పీఠాదిపతి స్నానాలు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోదావరిని సందర్శించడానికి పుష్కరాల సందర్భంగా మూడు కోట్ల మంది వస్తారని అంచనా. కుంభ మేళా స్థాయిలో పుష్కరాలను నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృత నిశ్చయంతో ఉన్నారు. దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను పుష్కరాల ఏర్పాట్ల మీద ఖర్చు చేస్తున్నారు. రాజమండ్రి పరిసరాల్లో 300 స్నానాల ఘాట్లను నిర్మించారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇరు ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.