పెద్ద నోట్ల రద్దు?

దేశంలో నల్ల ధనం బయటికి రావాలంటే తక్షణం వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్లను రద్దు చేయాలని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి సూచించారు. శాసనసభలో నల్లధనంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన, ఈ పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడం వల్ల అనదరి దగ్గర నుంచీ నల్ల ధనం బయటికి వచ్చేస్తుందనీ, విదేశాల్లో డబ్బు దాచుకున్నవారు కూడా తమ ధనాన్ని బయటపెడతారని సూచించారు. నల్లదనం గురించి మాట్లాడే ముందు చంద్రబాబు తన దగ్గర ఉన్న అక్రమ సంపద గురించి మాట్లాడాలని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దయ్యాలు వేదాల గురించి మాట్లాడుతున్నట్టు జగన్ ఇతరుల గురించి మాట్లాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Send a Comment

Your email address will not be published.