బురద రాజకీయం

రాజకీయ నాయకులు ఏదైనా రాజకీయం చేయగలరని మరోసారి నిరూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు భారీ వరదలు రైతుల్ని నిండా ముంచేసాయి. తెలంగాణా, కోస్తా ఆంధ్ర రైతులు ఈ అకాల వర్షాలకి తీవ్రం గా నష్ట పోయారు. పంటలంతా నీటిలో మునిగి పోయాయి. పంట నష్టం వేల కోట్ల లో ఉంటుందని అనధికార అంచనా, శ్రీ కాకుళం, ఈస్ట్, వెస్ట్ గోదావరుల్లో కొబ్బరి, వరి, పసుపు వంటి పంటలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరి, మిర్చి, పట్టి, పొగాకు, తెలంగాణలో కూరగాయలు, పూలు, పత్తి వంటి పంటలు తీవ్రం గా నష్ట పోయాయి. ఈ వరద బాధిత ప్రాంతాలని స్వయం గా పరిశీలించడానికి ప్రధాని మన్మోహన్, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఏరియల్ సర్వే చేయడానికి రాష్ట్రానికి స్వయం గా వస్తారని రైతులకి నష్ట పరిహారం ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వరద బీభత్సము ఏర్పడి వారాలు గడిచి పోతున్నా మన్మోహన్, సోనియమ్మలు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు.

వరద ప్రభావిత ప్రాంతాల్ని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేతలు ఎన్. చంద్రబాబు నాయుడు, వై.ఎస్. విజయ లక్ష్మి లతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రి బృందాలు కూడా పర్యటించాయి. అయితే వీరు ఎవ్వరూ బాధిత ప్రజలకి భరోసా ఇవ్వలేక పోయారు. కనీసం పంట నష్ట పోయి పీకల్లోతు కష్టాలు, కన్నీళ్ళతో ఉన్న ప్రజలకి ఓదార్పు ఇవ్వక పోగా, అధికార పక్షం పై ప్రతి పక్షం, ప్రతి పక్షాల పై అధికార పక్షాలు దుమ్మెత్తి పోసుకోవడం, మీ అసమర్ధత అంతే మీ అసమర్ధత వల్లే రాష్ట్రం ఇలా తయారైందని తిట్టి పోసుకోవడం సరి పోయింది. ఆఖరకి ఈ పరామర్శల పర్వంలో కూడా దిగజారుడు రాజకీయాలకి పాల్పడటం ప్రజల్ని అయోమయానికి గురి చేసింది. వై.ఎస్.ఆర్. సి.పి. గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వరద బాదిత ప్రాంతాల్ని పర్యటిస్తూ తెలంగాణ ప్రజల వద్దకి కూడా వెళ్ళారు. అయితే, తెలంగాణలోకి విజయమ్మ అడుగు పెట్టడానికి వీలు లేదని కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. అడ్డుకున్నాయి. దీనికి వత్తాసుగా పోలీసులు వ్యవహరించారు. ఇంకా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించక ముందే తెలంగాణ రాజ కీయ నాయుకులు ఈవిధంగా వ్యవహరించడం వారి దిగాజారుడుతనానికి నిదర్శనమని బాధల్లో ఉన్న రైతులని ఏ ప్రాంతం లో ఉన్నవారినయినా ఓదార్చ వచ్చని, ప్రజల్లో లేని విద్వేషాల్ని నాయకులు రెచ్చ కొట్టడం చూస్తే బురద రాజకీయాలు చేస్తున్నారనిపిస్తోందని స్తానికులు వ్యాఖానిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.