మెదక్ నుంచి రాహుల్ పోటీ?

ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు తెలిసింది. గతంలో ఆయన నాయనమ్మ ఇందిరా గాంధీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ లోని అమేథి నుంచి ఇదివరకటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా రాహుల్ 2014 నాటి ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అమేథీలో ఈసారి సమాజవాదీ పార్టీ అధికారంలో ఉన్నందువల్ల ఆయన అక్కడి నుంచి పోటీ చేసే విషయం ప్రశ్నార్థకంగా మారింది. సమాజ్ వాదీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కొద్దిగా బెట్టు చేస్తున్నట్టు కనబడుతోంది. ఆయన పార్టీ అమేథీలో రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చే అవకాశం తక్కువే. అయితే ఆయన ఈ రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అమేథీ నుంచి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలవకపోవడం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. ప్రధాని అభ్యర్థిగా ప్రచారం లభిస్తున్న యువ నాయకుడు అమేథీలో పరాజయం పాలయ్యే పక్షంలో పార్టీకి పరువు తక్కువ అవుతుందని కూడా పార్టీలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించిన తరువాత ఆయన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన సోనియా గాంధీకి ఇక్కడ ప్రతిష్ట పెరగడంతో ఇక్కడ విజయం సాధించడం రాహుల్ గాంధీకి తేలిక అని పార్టీ భావిస్తోంది. అంతే కాక, కాంగ్రెస్ పార్టీతో తెలంగాణా రాష్ట్ర సమితి ఒక్కసారిగా కాక, మెల్ల మెల్లగా విలీనం చెందాలని భావిస్తోంది. విలీనానికి ముందస్తుగా కాంగ్రెస్ కీలక అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది.

Send a Comment

Your email address will not be published.