మైక్రోసాఫ్ట్ కోసం పోటీ

మైక్రోసాఫ్ట్ సంస్థను ఆకట్టుకోవడం కోసం తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సాఫ్ట్ వేర్ సంస్థకు సి.ఇ.ఓ తెలుగువాడయిన సత్య నాదెండ్ల కావడంతో ఆయన మీద ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాయి. తెలంగాణా ఐ.టి మంత్రి కె.తారక రామారావు ఓ అడుగు ముందుకు వేసి, ఈ సంస్థ భారతీయ వ్యవహారాల అధిపతి భాస్కర్ ను కలుసుకుని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తో ఆయనకు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, సత్య నాదెండ్లకు హైదరాబాబ్ నగరంలో ఘన సన్మానం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజానికి ఈ విషయంలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ పాటికే ముందు ఉండాల్సింది.

సత్య నాదెండ్ల అనంతపురం జిల్లాకు చెందినవారు. అందువల్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టించాలని ఆలోచిస్తున్నారు. ఆయన తోడ్పాటుతో అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతం. ఏది ఏమయినా మైక్రోసాఫ్ట్ సంస్థను తమ తమ రాష్ట్రాలకు తీసుకు రావడం ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమయిపోయింది. సత్య నాదెండ్ల ఈ రాష్ట్రాన్నికి ప్రాధాన్యం ఇస్తారో తెలియదు.

Send a Comment

Your email address will not be published.