'రాజధాని' మార్పు

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్యలోని మార్టూరు-వినుకొండ-దొనకొండ ప్రాంతం అన్నివిధాలా సౌకర్యవంతంగా ఉంటుందని రాజధానిపై కేంద్రం నియమించిన శివరామ కృష్ణన్ కమిటీ తేల్చి చెప్పింది.
విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి మధ్య ప్రాంతం రాజధాని కావడానికి ఏమాత్రం అనుకూలంగా లేదని కూడా అది స్పష్టం చేసింది. వినుకొండ ప్రాంతంలో అయిదు వేల ఎకరాల బీడు భూమి, కొన్ని వేల ఎకరాల వ్యర్థ అటవీ ప్రాంతం ఉందనీ అది వివరించింది. అతి సమీపంలోనే జాతీయ రహదారి ఉన్న విషయాన్ని కూడా అది తెలిపింది. అన్ని కార్యాలయాలనూ ఒకే ప్రాంతంలో కాకుండా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని అది సూచించింది. విజయవాడ పరిసరాల్లో రాజధానిని నిర్మించడం వల్ల పర్యావరణం పాటు, వ్యవసాయ రంగం కూడా దారుణంగా దెబ్బ తింటాయని కూడా అది హెచ్చరించింది. ఆయితే తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నామని కూడా అది తెలిపింది. నిజానికి నవంబర్ 1 నుంచి రాజధానిని తాత్కాలికంగా విజయవాడకు మార్చడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Send a Comment

Your email address will not be published.