రాష్ట్రానికో చంద్రుడు

తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణా రాష్ట్ర సమితికి, ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ లభించింది. తెలంగాణా రాష్ట్ర సమితి మొత్తం 119 శాసనసభ స్థానాల్లో 62 స్థానాలను, తెలుగుదేశం పార్టీ మొత్తం 175 శాసనసభ స్థానాల్లో 106 స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఏప్రిల్ 30న తెలంగాణా లోనూ , మే 7న ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. ఈ రెండు పార్టీలు జూన్ 2న ఈ రెండు రాష్ట్రాలూ అధికారికంగా ఏర్పడిన తరువాత అధికారం చేపడతాయి.

తెలంగాణా రాష్ట్రంలో 22 స్థానాలతో కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంది. 20 స్థానాలతో టీడీపీ మూడవ స్థానంలో ఉంది. కాగా, ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ పార్టీకి 66 స్థానాలు లభించాయి. బొత్స సత్యనారాయణ, డి. శ్రీనివాస్, ధర్మాన ప్రసాద రావు వంటివారు పరాజయం పాలయ్యారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. తెలంగాణాలో మొత్తం 17 స్థానాలకు  తెలంగాణా రాష్ట్ర సమితికి 14 స్థానాలు, బీజేపీకి రెండు స్థానాలు లభించాయి. కాంగ్రెస్ కి ఒక స్థానం లభించింది. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 25 లోక్ సభ స్థానాలకు టీడీపీకి 17, జగన్ పార్టీకి 8 స్థానాలు లభించాయి. లోక్ సభ ఎన్నికల్లో వైజాగ్ లో జగన్ అమ్మ విజయ లక్ష్మి, రాజంపేటలో బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి పరాజయం పాలయ్యారు.

కాగా దేశంలో సుమారు మూడు దశాబ్దాల తరువాత సంకీర్ణానికి తెర పడింది. కేంద్రంలో బీజీపికి పూర్తి మెజారిటీ లభించింది. బీజేపీకి కడపటి సమాచారం ప్రకారం 543 స్థానాలకు గాను 300కు పైగా స్థానాలు లభించాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 334 స్థానాలు లభించాయి. నరేంద్ర మోడీ కూటమితోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమికి 66 స్థానాలు మాత్రమే లభించాయి.

Send a Comment

Your email address will not be published.