రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు

ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీతి ఆయోగ్ పాలక మండలి మొట్ట మొదటి సమావేశం ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీ లో జరిగింది. దేశం లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాలకు మరిన్ని విధులు, నిధుల అవకాశాలు కల్పిస్తామని ప్రధాని ప్రకటించారు. సాంకేతిక, విజ్ఞానాల్లో సాధికారికత కల్పిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. సుమారు 66 కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను త్వరలో రాష్ట్రాలకు బదిలీ చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు.  నిధుల కోసం, పథకాల కోసం కేంద్రం మీద ఆధారపడే పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కేంద్ర పథకాలను ప్రక్షాళన చేసి, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కాయక్రమాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. దేశంలో పెద్దఎత్తున ఉద్యోగాలను కల్పించడానికి ఒక జట్టుగా కేంద్రంతో కలిసి పని చేయాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రులతో మూడు కమిటీలను వేస్తామని, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్రాలు కూడా రెండు కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

నిధుల వినియోగంలో రాష్ట్రాలకు స్వేచ్చ కావాలని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ సమావేసంలో కోరారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కోరారు.

Send a Comment

Your email address will not be published.