లెజెండ్ పాటల ఆవిష్కరణ

మా నాన్న ఎన్ టీ ఆర్ నాకు, రాష్ట్రానికి, దేశానికే కాదు యావత్ ప్రపంచానికీ అసలైన లెజెండ్ అని నందమూరి బాలకృష్ణ నిగర్వంగా అన్నారు.

బాలయ్య బాబు హీరోగా, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే కథానాయికలుగా, జగపతి బాబు విల్లన్ గా నటించిన లెజెండ్ చిత్ర పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో మార్చి 7 వ తేదీన ఘనంగా జరిగింది.
ఈ ఆడియో వేడుకలు అట్టహాసంగా సాగాయి.

వారాహి, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రమే లెజెండ్.

దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, బాలకృష్ణల కాంబినేషన్ లో సింహ తర్వాత వచ్చిన రెండవ చిత్రమిది.

ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలనుంచి బాలకృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
కార్యక్రమం జరిగిన ప్రాంగణంలో బాలకృష్ణ కటౌట్లు అందంగా అలంకరించారు.

తొలుత లెజెండ్ టైటిల్ సాంగ్ ను, అలాగే చివరి పాత టైం బాంబు పల్లవి గల పాటను విడుదల చేసారు.
లస్కుటపా పాటను మూడవ పాటగా ఆవిష్కరించారు.
అలాగే మిగిలిన పాటలను విడుదల చేసారు. ఇందులో ఒక అమ్మ వారి శ్లోకం కూడా ఉంది.

చిత్రంలోని పాటలన్నీ రామజోగయ్య శాస్త్రి రాసారు. ఇందులో అన్ని రకాల పాటలు ఉన్నాయని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చెప్పారు. సకుటుంబంగా వెళ్లి చూడ దగ్గ చిత్రమని,. తాము మంచి చిత్రాన్నే అందిస్తామని, అభిమానులకు ఎలాంటి చిత్రం కావాలో తనకు బాగా తెలుసునని ఆయన అన్నారు.

కార్యక్రమంలో బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్, సోనాల్ చౌహాన్ ప్రత్యేక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకర్షించారు.
చిత్రంలోని ఐటెం సాంగ్ చేసిన హంస నందిని చీర కట్టులో ఈ కార్యక్రమానికి వచ్చారు.
ఫామిలీ హీరోగా అనేక చిత్రాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ పెంచుకున్న జగపతి బాబు విలన్ గా నటించడం ఇదే మొదటి సారి. తనను విలన్ పాత్రకు ఎన్నుకోవడం లో దర్శకుడు బోయపాటి ధైర్యం తెలిసోచ్చిందని జగపతి బాబు చెప్పారు.
అలాగే బాలకృష్ణ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలూ అందించడం ఇదే మొదటి సారి.

దైవ ప్రార్ధనతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన బాల కృష్ణ మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమంలో కదా నాయకుడు దేవి శ్రీ ప్రసాద్ అనిచెప్పిన బాలయ్య సినిమా లోని పాటలన్నీ బాగా వచ్చాయని అన్నారు. ఈ చిత్రంలో జగపతి బాబుది ప్రతినాయక పాత్రగా అనుకోకూడదని చెప్పారు. తనతో సమానమైన పాత్రలోనే జగపతి బాబు నటించాడని అన్నారు.

ఆయన తండ్రి వీ బీ రాజేంద్రప్రసాద్ స్థాపించిన సంస్థలో తాను రెండు చిత్రాలల్లో నటించినట్టు చెప్పారు.
ఈ నెల 28వ తేదీన ఈ చిత్రం అభిమానుల ముందుకు వస్తుంది.

Send a Comment

Your email address will not be published.