వాగ్దానానికి చుక్కెదురు

ఎన్నికల సందర్భంగా తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ నాయకులు రైతులకు ఇచ్చిన ప్రధాన వాగ్దానానికి చుక్కెదురయింది. తాము అధికారానికి వచ్చీ రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణా రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు ప్రకటించి అధికారానికి వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రైతు రుణాల మాఫీకి సంబంధించిన ఫైలుపై సంతకం కూడా చేశారు. అయితే బ్యాంకులు ఇప్పుడు రుణాల మాఫీకి అంగీకరించడం లేదు. రిజర్వు బ్యాంకు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. రైతులు బకాయీలు చెల్లించాల్సిందేనని అది స్పష్టం చేసింది. రుణాల మాఫీలో బ్యాంకులను భాగస్వాముల్ని చేయవద్దని కూడా అది సూచించింది. రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలంటే తక్షణం బకాయీలను చెల్లించాలని కూడా రిజర్వు బ్యాంకు ఆదేశించింది. అవసరమనుకుంటే ప్రభుత్వాలు నేరుగా రుణాలు చెల్లించాలని కూడా అది సూచించింది. అయితే కొత్త ప్రభుత్వాల వద్ద జీతాలు చెల్లించడానికి కూడా నిధులు అందుబాటులో లేవని తెలిసింది. ముందుగా బ్యాంకులు వ్యవసాయ రుణాలను చెల్లిస్తే, వాటిని ఆ తరువాత తాము చెల్లించవచ్చని ప్రభుత్వాలు భావించాయి కానే బ్యాంకులు అందుకు సిద్ధంగా లేవు.

Send a Comment

Your email address will not be published.