శ్రీకృష్ణ వధువు

పరుగులిడే వయసు… చూడ వెనుకకు పోయె!
కార్యమొనరించ… యుత్సాహంబు కొంచెమాయె!
భక్ష్యాదులారగింప… ఉదరంబు కడుభారమనితోచె!
భాధ్యతలు మితిమీర …భయము కంపము పుట్టె!

భువనవిజయమొకటి… ధైర్యోల్లాసము నెదనింపె!
శ్రీకృష్ణరాయబారము తలపులో… నవనూతన వధువాయె!
శ్రీరాముని దయతో… వధువు అక్షరభ్యాసంబు చేసె!
శ్రీనివాస కటాక్షమున… మాటలుమూటలు నేర్చె!

రఘుసూర్యుల వీక్షనమున…. అభినయమేమోయన తెలిసె!
మల్లికేశుప్రత్యూషల సావాసమున …అలంకరణ చేయనేర్చె!
రసపోషకులు పట్టుదలతో… నవరసములు అభినయించగా!
వధువు మేలిమి బంగారముతో… వయ్యారమె విరజిమ్మెగా!
శ్రీకృష్ణుడు గానమును వేణువుపై వినిపించగా ..హృదయాలు పులకించెగా!
భువనవిజయ మొప్పెగా…తెలుగుమల్లి ప్రతిభగా కాంతులు వెదజల్లగా !

డా. రాంప్రకాష్ ఎర్రమిల్లి

Send a Comment

Your email address will not be published.