షిర్డీ సాయి దేవుడు కాదా?

షిర్డీ సాయి బాబా దేవుడు కాదని, ఆయనను పూజించనక్కర లేదని ద్వారకా పీఠం అధిపతి స్వామి స్వరూపానంద అంటున్నారు. షిర్డీ సాయి బాబా ఇతర మతానికి చెందినవారని, పైగా మాంసం తినేవారని, అందువల్ల ఆయనను పూజించాల్సిన అవసరం లేదని స్వరూపానంద హరిద్వార్ లో వ్యాఖ్యానించారు. అసలు ఆయన దేవుడు కాదని, విదేశీయులు హిందూ మతాన్ని బలహీనపరచడానికి ఆయనను భారత్ పై రుద్దారని స్వామీజీ అన్నారు. షిర్డీ సాయి బాబాను పూజించేవారు రాముడిని పూజించడం ఆపేయాలని, గంగలో స్నానం చేయకూడదని, హర హర మహాదేవ నామ స్మరణ నిలిపేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. స్వరూపానంద వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై సాయి భక్తులు కొందరు హరిద్వార్ తో సహా వివిధ నగరాల్లో పిటిషన్లు వేశారు. ఆయన వ్యాఖ్యలు సాయి భక్తుల మనో భావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని నటుడు మోహన్ బాబు విమర్శించారు.

Send a Comment

Your email address will not be published.