సిడ్నీ తెలుగు సంఘం క్రొత్త సారధి - శ్రీ కోడూరు రామమూర్తి

సిడ్నీ తెలుగు సంఘం గత శనివారం నవంబర్ 2వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశంలో శ్రీ కోడూరు రామమూర్తి గారి అధ్యక్షులుగా క్రొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొంది.  ఈ సందర్భంగా శ్రీ రామమూర్తి గారు మాట్లాడుతూ సిడ్నీ లోని తెలుగు వారందరూ ఏకం చెయ్యటానికి తాను కట్టుబడి ఉన్నానని అందరూ దీనికి తగు సహాయ సహకారలందివ్వలనీ సభ్యులను కోరారు.  ఉగాది సందర్భంగా “తెలుగు సందడి” కార్యక్రమాన్ని నిర్వహించడానికి పలువురు ముందుకు వచ్చి ఆస్ట్రేలియాలోని తెలుగువారందరూ పాల్గొనేలా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని ఆశా భావం వ్యక్తం చేసినట్లు చెప్పారు.

శ్రీ మూర్తి గారు ఇంతకు ముందు రెండు సార్లు సిడ్నీ తెలుగు సంఘం అధ్యక్షులు గానూ మరియు అనేక దాతృత్వ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించడం మనందరికీ తెలిసిందే.  ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవంలో వారు నిర్వహించిన పాత్రకు “ప్రవాసాంధ్ర కళా బంధు” బిరుదుతో సత్కరించడం జరిగింది.  శ్రీ రామమూర్తి గారు వారికున్న సినీ ప్రముఖుల పరిచయాల వలన శ్రీ SP బాల సుబ్రహ్మణ్యం గారి సంగీత విభావరి కార్యక్రమాన్ని మరెన్నో ఇతర కార్యక్రమాలని నిర్వహించి మన తెలుగు దనానికి మరింత వన్నె తెచ్చారు.

మన జాతి తెలుగు, మన కులం తెలుగు
మన ప్రాంతం తెలుగు, మన ఊపిరి తెలుగు
మన సంప్రదాయం తెలుగు

తెలుగు వారి మీద మరియు తెలుగు భాషపై ఉన్న మమకారంతో శ్రీ మూర్తి గారు పైనుదహరించిన సరిక్రొత్త నినాదంతో అందర్నీ ముందుకు తీసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ ప్రేమ కళాబంధుకి తెలుగు వారందరూ చేయూతనందించి సహకరిస్తారని ఆశిద్దాం.

Send a Comment

Your email address will not be published.