10 జిల్లాలతో తెలంగాణా

మొత్తానికి బీజేపీ ఒత్తిడి పనిచేసినట్టు కనిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గం 10 జిల్లాలతోనే తెలంగాణాను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది. నిన్న రాత్రి వరకూ రాయల తెలంగాణా అనీ, 10 తెలంగాణా జిల్లాలకు రెండు రాయలసీమ జిల్లాలను కూడా కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని భావిస్తూ వచ్చిన కేంద్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు బీజేపీ తిరస్కరించేసరికి తన ప్రయత్నాన్ని విరమించుకుంది. తెలంగాణా ప్రాంతంతో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కూడా కలిపితే, ఆంద్ర, తెలంగాణా ప్రాంతాలకు చేరి సగం జిల్లాలు ఉంటాయని, మున్ముందు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు జరపదనీ కేంద్రం భావించింది. అయితే రాయలసీమను విభజిస్తే, ముస్లింలు ఎక్కువగా ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలలో ముస్లింలు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని బీజేపీ అర్థం చేసుకుని, ఆ ప్రయత్నాన్ని గట్టిగా తిరస్కరించింది.

పది జిల్లాలతో తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందు వల్ల ఇక ఈ ప్రతిపాదన రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి వద్దకు వెడుతుంది. ఆయన దగ్గర నుంచి మళ్ళీ కేంద్రానికి సవరణలతో వస్తుంది. అక్కడి నుంచి రాష్ట్ర శాసనసభ చర్చకు వెడుతుంది. ఆ తరువాత పార్లమెంట్ ఆమోదానికి వెడుతుంది. పదేళ్ళ పాటు హైదరాబాద్ నగరం ఈ రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. మరో 45 రోజుల్లో ఆంద్ర ప్రాంత రాజధానిపై కేంద్ర కమిటీ ఒకటి నిర్ణయం తీసుకుంటుంది. పది జిల్లాలతో తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన్నందువల్ల, ఇక ఈ ప్రతిపాదన తెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి వద్దకు వెడుతుంది. ఆయన దగ్గర నుంచి మళ్ళీ కేంద్రానికి సవరణలతో వస్తుంది. అక్కడి నుంచి రాష్ట్ర శాసనసభ చర్చకు వెడుతుంది. ఆ తరువాత పార్లమెంట్ ఆమోదానికి వెడుతుంది.

Send a Comment

Your email address will not be published.