శాంతి గీతం!!!

శాంతి గీతం!!!

నింగి శాంతి నేల శాంతి
అంతరిక్షం శాంతి శాంతి
నీరు శాంతి గాలి శాంతి
విశ్వమంతా శాంతి శాంతి    ||నింగి శాంతి||

ఓషతీతతి శాంతి శాంతి
వృక్ష జాతులు శాంతి శాంతి
వేదవిద్యలు శాంతి శాంతి
విబుధ వర్యులు శాంతి శాంతి    ||నింగి శాంతి||

నీకు  శాంతి నాకు శాంతి
మనకునెప్పుడు శాంతి శాంతి
శాంతికెయ్యది కారణమ్మో
దానికెప్పుడు శాంతి శాంతి    ||నింగి శాంతి||

అణువు శాంతి తనువు శాంతి
తోటి ప్రాణుల వలన శాంతి
ప్రజలు శాంతి ప్రభువు శాంతి
విశ్వమంతా శాంతి శాంతి    ||నింగి శాంతి||

Send a Comment

Your email address will not be published.